బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో ఆడియన్స్ ను పెద్దగా థియేటర్స్ కి రప్పించలేక పోయిన సినిమాగా కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా సినిమా నిలిచింది, రియలిస్టిక్ స్టొరీ పాయింట్ అంటూ తెరకెక్కించిన ఈ సినిమా తమిళ్ లోనో మళయాళం లోనో తెరకెక్కి ఉంటే రెస్పాన్స్ ఎలా ఉండేదేమో కానీ టాలీవుడ్ లో ఇప్పటికీ ఇలాంటి కథలను డైజెస్ట్ చేసుకోవడం కష్టమే అని చెప్పొచ్చు. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్…
రిజల్ట్ ను సొంతం చేసుకుంది…. దాంతో డిజిటల్ రిలీజ్ వర్షన్ ని కొద్దిగా మర్చుతున్నాం అని ఈ సారి ఆడియన్స్ ను మెప్పించే అవకాశం పుష్కలంగా ఉందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెప్పడంతో సినిమా డిజిటల్ రిలీజ్ లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది…
ఆసక్తిగా మారగా రీసెంట్ గా సినిమా డిజిటల్ రిలీజ్ వర్షన్ కొన్ని చిన్న చిన్న మార్పులతో రాగా రెస్పాన్స్ పెద్దగా ఏమి మారలేదని సోషల్ మీడియా లో సినిమా పై వస్తున్న రెస్పాన్స్ ని చూస్తె అర్ధం అవుతుంది, సినిమా హాష్ టాగ్ పై దాదాపు సినిమా రిలీజ్ టైం లో…
ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అదే టైప్ లో రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు. కోర్ పాయింట్ ఒకటే కాబట్టి తెలుగు ఆడియన్స్ ఇలాంటి సబ్జెక్ట్ ని డైజెస్ట్ చేసుకోవడం కష్టం అని, మరీ ఇలాంటి కథని ఎలా తీశారని విమర్శలు గుప్పించే వాళ్ళు ఉన్నారు, అదే టైం లో కొత్త అటెంప్ట్ కానీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ అని చెప్పే వాళ్ళు ఉన్నారు.
మొత్తం మీద రెస్పాన్స్ ముందులానే మిక్సుడ్ గా ఉండగా సినిమా వీకెండ్ లో ఆహా యాప్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద యూనిక్ వ్యూస్ 1 లక్షా 80 వేల దాకా వచ్చాయి అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి, ఆ లెక్కన డిజిటల్ వ్యూస్ సాలిడ్ గానే సినిమాకి సొంతం అయ్యాయి అని చెప్పొచ్చు.