టాలీవుడ్ లో చాలా వరకు సక్సెస్ ఫుల్ మూవీస్ ని నిర్మించిన ప్రొడ్యూసర్ గా దిల్ రాజు కి మంచి పేరు ఉంది… సినిమాల పై తన డిసిషన్ చాలా వరకు వర్కౌట్ అవ్వడం తో ఎక్కువ మంది దిల్ రాజు సినిమా అంటే మినిమమ్ ఉంటుంది అన్న ఆలోచన లో ఉంటారు, కొన్ని సార్లు మాత్రమే ఆ అంచనాలను అందుకునే సినిమాలు పడలేదు కానీ చాలావరకు అయితే అంచనాలను అందుకున్నాయి.
దిల్ రాజు బ్యానర్ లో నాచురల్ స్టార్ నాని కెరీర్ లో 25 వ సినిమాగా రూపొందిన సినిమా వి ది మూవీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమా లాస్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సింది, ఫస్ట్ వేవ్ వలన అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా…
పోస్ట్ పోన్ అవ్వగా తర్వాత డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని టాక్ ఆశించిన మేర రాకపోవడం తో టాక్ వైజ్ ఫ్లాఫ్ గా నిలిచింది, కానీ అమెజాన్ ప్రైమ్ లో మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వక ముందు డిజిటల్ రిలీజ్ ఎందుకు చేశారో…
అనుకున్నా రిలీజ్ అయిన తర్వాత టాక్ చూసి డిజిటల్ రిలీజ్ చేసి మంచి పని చేశారు అని అనుకోని వారు ఉండరు. దిల్ రాజు ని కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు అంటూ మెచ్చుకున్నారు. కానీ ఈ సినిమా పై రీసెంట్ గా స్పందించిన దిల్ రాజు… ఈ సినిమా ను డిజిటల్ రిలీజ్ కాకుండా పాండమిక్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ చేసి ఉంటే…
కచ్చితంగా సూపర్ హిట్ అయ్యేదని, కానీ డిజిటల్ రిలీజ్ వలన అంచనాలను అందుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ స్టేట్ మెంట్ పై అందరూ కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు… ఇలాంటి సైకో థ్రిల్లర్ అంటూ రొటీన్ కథతో వచ్చిన సినిమాలు అనేకం ఉన్నాయి. రొటీన్ కథతోనే వచ్చిన సినిమా థియేటర్స్ లో వచ్చినా ఓపెనింగ్స్ తప్ప లాంగ్ రన్ దక్కేది కాదని చెప్పొచ్చు.