పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి అద్బుతమైన ఆరంభాన్ని సొంతం చేసుకుంది కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ఓ రేంజ్ లో ఉండటం వలన సినిమా కలెక్షన్స్ పై అది తీవ్రంగా ఇంపాక్ట్ చూపింది. దాంతో సినిమాకి థియేటర్స్ ని తగ్గించడం, షోలు తగ్గించడం, ఆక్యుపెన్సీ కూడా తగ్గించడం లాంటివి చేయడం తో కలెక్షన్స్ పై అది..
ఎఫెక్ట్ చూపగా సినిమా డిజిటల్ రిలీజ్ పై కూడా ఆ ఇంపాక్ట్ కనిపించింది, సినిమాను ముందుగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత డిజిటల్ రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన కొంచం లెక్కలు మర్చి నెల రోజుల గ్యాప్ లో…
డిజిటల్ రిలీజ్ చేయాలి అని డిసైడ్ అయ్యి అమెజాన్ ప్రైమ్ కొంచం ఎక్కువ ఆఫర్ చేయగా, ఫైనల్ గా సడెన్ షాకిస్తూ సినిమాను ఇప్పుడు రిలీజ్ అయిన 21 వ రోజు అంటే ఈ నెల 30 న డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు. దాంతో రికార్డ్ స్థాయి వ్యూస్ సినిమాకి దక్కడం ఖాయమని చెప్పొచ్చు.
ఇక మరో అప్ డేట్ లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి తర్వాత చేస్తున్న సినిమా ఆచార్య కోసం ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా ఆడియన్స్ ముందుకు మే 13 న రావాల్సింది కానీ సెకెండ్ వేవ్ వలన షూటింగ్ కి డిలే అవ్వడం తో రిలీజ్ పోస్ట్ పోన్ కన్ఫాం అని టాక్ వచ్చింది…
కానీ మేకర్స్ నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు, కానీ ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా యూనిట్ ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేస్తున్నామని కన్ఫాం చేశారు. కొత్త రిలీజ్ ను పరిస్థితులు చక్కదిద్దుకున్నాక చెబుతాం అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చు అన్న టాక్ వినిపిస్తుంది.