పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యుమంగస్ ఎక్స్ పెర్టేషన్స్ తో బరిలోకి దిగగా రిలీజ్ రోజు ముందు నుండే ఆంధ్రాలో అనేక ఇబ్బందులను తర్వాత సెకెండ్ వేవ్ తో అనుకోని అవరోధాలను తీవ్రంగా ఎదురుకుంటూ వచ్చింది, అయినా కానీ సినిమా అద్బుతమైన కలెక్షన్స్ నే సొంతం చేసుకుందని చెప్పొచ్చు. కానీ సినిమా రిలీజ్ తర్వాత కొన్ని రోజులకు…
సినిమా డిజిటల్ లో అతి త్వరలో రిలీజ్ కూడా కాబోతుంది అంటూ సోషల్ మీడియా లో ఫుల్ ప్రచారం జరిగింది, చాలా మంది టాలీవుడ్ వాళ్ళు కూడా దీనిపై స్పందించారు. దాంతో వకీల్ సాబ్ త్వరగానే డిజిటల్ రిలీజ్ కాబోతుంది అన్న వార్తా స్ప్రెడ్ అవ్వడం తో…
వెంటనే నిర్మాత దిల్ రాజు ఒక వీడియో బైట్ లో పెద్ద హీరో సినిమా ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులలో అయినా రిలీజ్ అయిన 50 రోజులకే డిజిటల్ రిలీజ్ జరుగుతుంది అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. కానీ కట్ చేస్తే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన 21 వ రోజే డిజిటల్ రిలీజ్ కాబోతుంది.
దాంతో ఈ విషయం అఫీషియల్ గా అనౌన్స్ అయిన తర్వాత దిల్ రాజు అలా అనడం ఏంటి ఇలా రిలీజ్ చేయడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. కానీ అసలు విషయం వేరే ఉందని తెలుస్తుంది. ముందు నుండి 50 రోజుల క్లాజ్ నే పెట్టుకున్నా కానీ పరిస్థితులు మరీ వికటించడంతో… థియేటర్స్ లో సినిమా రన్ ఆల్ మోస్ట్ క్లోజింగ్ కి వచ్చింది.
ఇలాంటి టైం లో ముందే రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటే రేటు అమాంతం పెంచి భారీ మొత్తం ఇస్తాం అని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు చెప్పడం తో సినిమా రన్ కంప్లీట్ ఇక అయినట్లే అనుకుని దిల్ రాజు సినిమా డిజిటల్ రిలీజ్ ను 21 వ రోజు కన్ఫాం చేశారని అంటున్నారు. ఇదీ రీజన్ అని క్లోజ్ సర్కిల్స్ లో చెబుతున్నారు… మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.