హిట్స్ కి ఫ్లాఫ్స్ కి అతీతంగా వరుస పెట్టి సినిమాలతో జోరు చూపే హీరో మాస్ మహారాజ్ రవితేజ, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో వరుసగా 4 డిసాస్టర్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకున్నా కానీ రెమ్యునరేషన్ పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ హీరోగానే ఉన్న రవితేజ ఈ ఇయర్ ఎట్టకేలకు లేటెస్ట్ మూవీ క్రాక్ తో అల్టిమేట్ కంబ్యాక్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాడు.
అనేక అవరోధాలను ఎదురుకున్నా కానీ క్రాక్ సినిమా అల్టిమేట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది, ఇలాంటి టైం లో ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తున్న రవితేజ ఈ సినిమా తర్వాత మరో కొత్త సినిమా కమిట్ అయ్యాడు. కొత్త డైరెక్టర్ శరత్ డైరెక్షన్ లో…
కొత్త సినిమా కమిట్ అవ్వగా ఈ సినిమా కి గాను తక్కువ టైం లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నాడని టాలీవుడ్ లో టాక్ చాలా గట్టిగా వినిపిస్తుంది. ఈ సినిమా కోసం రవితేజ మొత్తం మీద 30 రోజుల వర్కింగ్ డేస్ ను కేటాయించారట..
కాగా ఈ 30 రోజుల వర్కింగ్ డేస్ కి గాను ఏకంగా 8.2 కోట్ల భారీ రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నారట రవితేజ. ఇది నిజంగానే సెన్సేషనల్ అని చెప్పొచ్చు. స్టార్ హీరోలు భారీ రెమ్యునరేషన్ ని తీసుకోవడం కామన్ అయిపోయిన ఈ టైం లో ప్రస్తుతం మునుపటి లా ఇయర్ కి రెండు మూడు సినిమాలు చేయాలని డిసైడ్ అయిన రవితేజ ఒక్కో సినిమా కి ఈ రేంజ్ రెమ్యునరేషన్ అంటే…
టాప్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రేంజ్ రెమ్యునరేషన్ అని చెప్పొచ్చు. ఇక లాభాల్లో కూడా ప్రాఫిట్ షేర్ ఉంటుందని అంటున్నారు. ఒక్క సాలిడ్ హిట్ తో కంబ్యాక్ ఇచ్చిన రవితేజ అప్ కమింగ్ మూవీస్ తో తన హిట్ ట్రాక్ ని అలానే కొనసాగిస్తాడా లేదా అన్నది అప్ కమింగ్ మూవీస్ తో తేలనుంది…