స్టార్ బ్యాగ్ డ్రాప్ ఉన్నా, కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టే తండ్రి నిర్మాతగా ఉన్నప్పటికీ కూడా హిట్స్ అందుకోవడం విషయంలో అలాగే నటుడిగా ఫుల్ మార్కులు తెచ్చుకోవడం విషయంలో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ విమర్శలను ఎదురుకుంటూనే ఉన్నారు. కెరీర్ మొదలు పెట్టిన 5 ఏళ్ళకి ఎలాగోలా తమిళ్ లో బస్టర్ హిట్ గా నిలిచిన రాక్షసుడు సినిమా తో తెలుగు లో క్లీన్ హిట్ ని అలాగే నటుడిగా కెరీర్ లో బెస్ట్…
పెర్ఫార్మెన్స్ ని ఈ సినిమా తోనే ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్, ఇక అప్ కమింగ్ మూవీస్ విషయం లో కూడా నటుడిగా ఫుల్ మార్కులు సాధించే ప్రయత్నం చేస్తాడు అనుకుంటే వెంటనే చేసిన అల్లుడు అదుర్స్ సినిమా తో మరోసారి నటన పరంగా విమర్శలను ఎదురుకున్నాడు.
ఇలాంటి టైం లో ఇప్పటికే తెలుగు ఛత్రపతి ని హిందీ లో రీమేక్ చేస్తూ ఉండగా ఛత్రపతి ని ఎక్కడ చెడగొట్టుతారో అని ఇప్పటికే అందరూ టెన్షన్ పడుతుంటే… ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కర్ణన్ సినిమాను తెలుగు లో రీమేక్ ని అఫీషియల్ గా…
కన్ఫాం చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్… దాంతో ఇప్పుడు ఆ సినిమాలో ధనుష్ పెర్ఫార్మెన్స్ ని బెల్లంకొండ మరిపించలేడు అంటూ సోషల్ మీడియా లో హీరో పై ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. సొంత కథలు కాకుండా రీమేక్ లు ఏంటి, అది కూడా అలాంటి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రలు న్యాయం చేయకపోతే విమర్శలు ఓ రేంజ్ లో రావడం ఖాయం అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
కానీ అదే టైం లో రాక్షసుడు సినిమా తో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన బెల్లంకొండ, ఈ సారి కర్ణన్ సినిమాతో నటుడిగా మరింత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి నోళ్ళు మూయించాలని భావిస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది. సినిమా తో ఎంతవరకు మెప్పించగలుగుతాడు అన్నది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది అని చెప్పొచ్చు.