పాన్ ఇండియా సెన్సేషన్…. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాహో తర్వాత మళ్ళీ రెండేళ్ళుగా చేస్తున్న సినిమా రాధే శ్యామ్, పాన్ ఇండియా లెవల్ లో అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ భారీ ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు, సినిమా ఎప్పుడు వచ్చినా ఆల్ ఇండియా లెవల్ లో రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని ఎదురు చూస్తున్న తరుణం లో ఎప్పటికప్పుడు డిలే అవుతూ…
వస్తున్న రాధే శ్యామ్ సినిమా ఎట్టకేలకు జులై ఎండ్ లో పాన్ ఇండియా లెవల్ లో భారీగా రిలీజ్ కి సిద్ధం అవ్వగా ఇప్పుడు సడెన్ గా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ గట్టిగా ఉండటం తో ఆ ఇంపాక్ట్ అప్ కమింగ్ మూవీస్ అన్నింటి మీద కూడా క్లియర్ గా కనిపిస్తుంది.
దానికితోడు బాలీవుడ్ ఇప్పటికీ కూడా కోలుకోక పోవడం లాంటివి కూడా మరింత భారీగా ఇంపాక్ట్ చూపుతున్న టైం లో మళ్ళీ చాలా సినిమాలు డిజిటల్ రిలీజ్ ల పై దృష్టి పెడుతున్నాయి. ఇలాంటి టైం లో రాధే శ్యామ్ పై ఒక రూమర్ ఇప్పుడు ట్రేడ్ లో చక్కర్లు కొడుతుంది…
మేకర్స్ ఈ సారి ఎందుకో అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కే ఫిక్స్ అయ్యే ఆలోచనలో ఉన్నారని, అప్పటి వరకు పరిస్థితులు సద్దుకుంటాయి అన్న ధీమా తో కూడా ఉండటం తో మొదటి ఆప్షన్ థియేటర్స్ లోనే రిలీజ్ అని, కానీ ఒకవేళ పరిస్థితులు అలానే ఉంటే… పరిస్థితులు బాగున్న చోట థియేటర్స్ లో సినిమా నార్మల్ గానే రిలీజ్ అవుతుందని…
అలాగే పే పెర్ వ్యూ పద్దతిలో డిజిటల్ లో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే రూట్ లో రీసెంట్ గా సల్మాన్ రాధే రిలీజ్ కాబోతుంది. కానీ రాధే శ్యామ్ బడ్జెట్ వేరు. ఆ బడ్జెట్ కి ఇలాంటి నిర్ణయం వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది అన్నది చెప్పలేం… మరి ఈ విషయం లో ఎంతవరకు నిజం ఉంది అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.