బాలీవుడ్ హీరోయిన్స్ లో ప్రజెంట్ టాప్ ప్లేస్ లో ఉన్న హీరోయిన్ గా ఆలియా భట్ ని చెప్పుకోవాలి, సినిమా సినిమా కి తన రేంజ్ ని అక్కడ పెంచుకుంటూ పోతున్న ఆలియా భట్ మెయిన్ స్ట్రీం మూవీస్ తో పాటు వీలు కుదిరినప్పుడల్లా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో కూడా సూపర్ సక్సెస్ లను సొంతం చేసుకుని ప్రజెంట్ బాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ గా దూసుకు పోతుంది.. ప్రస్తుతం ఒక పక్క ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న అలియా…
బాలీవుడ్ లో చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ గంగుభాయ్ ఖాతియా వాడా సినిమా తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది, ఈ సినిమా ను ముందు జులై ఎండ్ లో ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కి పోటిగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు.
అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు… కానీ ఇప్పుడు సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉన్న నేపధ్యంలో మళ్ళీ థియేటర్స్ లో సినిమాలు రావడానికి టైం పట్టేలా ఉండటం తో ఈ సినిమాను ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ చేయాలని భారీగా OTT ఆఫర్స్ వస్తున్నాయి.
లేడీ ఓరియెంటెడ్ మూవీ నే అయినా ఆలియా భట్ క్రేజ్ దృశ్యా ఈ సినిమా కి డిజిటల్ రిలీజ్ కోసం ఏకంగా 60-70 కోట్ల రేంజ్ లో రేటు ఆఫర్ చేస్తున్నారట. ఇది నిజంగానే అల్టిమేట్ రేటు అని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ రిలీజ్ అయినా బిజినెస్ 30 నుండి 40 కోట్ల రేంజ్ లో జరిగే చాన్స్ ఉంటుంది కానీ ఇక్కడ డైరెక్ట్ రిలీజ్ కోసం….
ఏకంగా 70 కోట్ల వరకు ఆఫర్స్ వస్తూ ఉండటం తో త్వరలోనే సినిమా పై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది… అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా బాక్స్ ఆఫీస్ రిలీజ్ రోజునే డిజిటల్ లో రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరి మేకర్స్ ఈ రేటు ని కన్ఫాం చేసి డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేస్తారో లేదో చూడాలి.