Home గాసిప్స్ చిన్న సినిమా అన్నారు….డబుల్ ప్రాఫిట్ వచ్చే రేటు వచ్చింది అక్కడా!

చిన్న సినిమా అన్నారు….డబుల్ ప్రాఫిట్ వచ్చే రేటు వచ్చింది అక్కడా!

0

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ ఎండ్ టైం లో ఆడియన్స్ ముందుకు రావాల్సిన సినిమాల్లో చిన్న సినిమా ఏక్ మినీ కథ కూడా ఒకటి… చిన్న సినిమానే అయినా  UV క్రియేషన్ వాళ్ళు నిర్మించిన సినిమా అవ్వడం టీసర్ ట్రైలర్ లు బాగా ఆకట్టుకునేలా ఉండటం తో సినిమా పై ఉన్నంతలో మంచి బజ్ ఏర్పడింది. ఇక సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి అలరించడం ఖాయం అనుకున్న టైం లో సెకెండ్ వేవ్ ఎఫెక్ట్…

గట్టిగా ఉండటం తో ఆ ఇంపాక్ట్ సినిమా రిలీజ్ పై పడి సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు, కాగా సెకెండ్ వేవ్ పీక్స్ కి వెళ్ళడం తో కొన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ బాట పట్టగా ఈ సినిమా యూనిట్ కూడా అదే రూట్ లో సినిమాను రిలీజ్ చేయాలనీ…

ప్లాన్ చేస్తున్న తరుణం లో సాలిడ్ రేటు సినిమా కి దక్కిందని తెలుస్తుంది. సినిమా ను మొత్తం మీద 4.5 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కి డిజిటల్ రిలీజ్ కి గాను అద్బుతమైన రేటు ఆఫర్ వచ్చిందట, రీసెంట్ టైం లో….

చిన్న సినిమాల్లో హైయెస్ట్ రేటు గా ఈ రేటుని చెబుతూ ఉండటం విశేషం, మొత్తం మీద డిజిటల్ రిలీజ్ కింద ఏక్ మినీ కథ సినిమా కి 9 కోట్ల రేటు సొంతం అయ్యిందని సమచారం. అంటే పెట్టిన 4.5 కోట్ల బడ్జెట్ కి డబుల్ రేటు అని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినా కానీ మహా అయితే 5 కోట్ల వరకు బిజినెస్ ను సాధించేదేమో ఈ సినిమా…

కానీ డిజిటల్ రిలీజ్ కి ఈ రేంజ్ రేటు అంటే మట్టుకు డబుల్ ప్రాఫిట్ ఒక్క డిజిటల్ రిలీజ్ కే దక్కుతుందని చెప్పొచ్చు. ఇక శాటిలైట్ రైట్స్ కానీ డబ్బింగ్ రైట్స్ కానీ ఉండనే ఉండటం తో అవి కూడా మినిమమ్ రేటు సొంతం చేసుకున్నా సినిమా కి ఫుల్ ప్రాఫిట్స్ రావడం ఖాయం, త్వరలోనే సినిమా డిజిటల్ రిలీజ్ పై అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here