టాలీవుడ్ టాప్ కమెడియన్స్ లో సునీల్ ముందు నిలిచే వారు అని చెప్పాలి, ఓ 15 ఏళ్ల క్రితం ఒక పక్క బ్రహ్మానందం జోరు పీక్స్ లో ఉన్నా కానీ సునీల్ కూడా చేతినిండా సినిమాలతో ప్రతీ సినిమాలో కంపల్సరీ గా ఉంటూ తన కామెడీ తో ఆడియన్స్ ను అలరిస్తూ ఉండేవారు, అలాంటి పీక్ టైం లోనే రోజు కి 10 లక్షల రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్న సునీల్ హీరోగా మర్యాద రామన్న తో మారిపోయాడు.
ఆ సినిమా తర్వాత పూలరంగడు సినిమాలు సూపర్ హిట్ గా నిలవడం తో చేతినిండా హీరోగా సినిమాలు చేస్తూ వచ్చిన సునీల్ సినిమా కి రెమ్యునరేషన్ గా 3 కోట్ల దాకా అందుకునేవారు… కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర పూలరంగడు సినిమా తర్వాత సునీల్ చేసిన అన్ని సినిమాలలో…
ఏవి కూడా హిట్ గీతని దాటలేక పోవడం తో తన మార్కెట్ భారీగా పడిపోయింది… దీంతో మళ్ళీ కమెడియన్ రోల్స్ కి ట్రై చేసినా పెద్దగా వర్కౌట్ కాని పరిస్థితిలో డిస్కో రాజా లో అటు కామెడీ అండ్ ఇటు నెగటివ్ టచ్ ఉన్న రోల్ చేయగా అది పెద్దగా వర్కౌట్ కాలేదు.
తర్వాత వచ్చిన కలర్ ఫోటో లో సునీల్ విలనిజం చూపించిన సునీల్ తర్వాత రీసెంట్ టైంలో పుష్ప, జైలర్, మహా వీరుడు ఇలా కొన్ని తమిళ్ మూవీస్ లో డిఫెరెంట్ రోల్స్ తో మెప్పిస్తూ ఉండగా. మళ్ళీ ఇప్పుడు కెరీర్ లో మంచి జోరుతో దూసుకు పోతున్న సునీల్ తిరిగి కమెడియన్ రోల్స్ లెవల్ లో కాకున్నా ఇప్పుడు ఒక్కో సినిమాకి రోజుకి 5-8 లక్షల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నాడని టాలీవుడ్ లో టాక్ ఉంది, కానీ ఒకప్పటి కామెడీని సునీల్ నుండి ఇప్పటికీ ఆడియన్స్ అయితే మిస్ అవుతూనే ఉన్నారని చెప్పొచ్చు.