టాలీవుడ్ నిర్మాతలలో దిల్ రాజు సినిమాల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే, సినిమాల మీద దిల్ రాజు ఒపీనియన్ చాలా వరకు నిజాలు అయ్యాయి కూడా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నది తక్కువ టైం అయినా కానీ ఉన్నంతలో సాలిడ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే…
కాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ పీక్స్ లో పెరిగి పోవడం తో ఇక తప్పక సినిమాను థియేటర్స్ లో ఆపాల్సి రాగా రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది, కాగా సినిమా డిజిటల్ రేటు…
ముందు అనుకున్నది ఒక్కటి తర్వాత పెరిగిన రేటు మరోటి కాగా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బ పడినా కానీ సినిమా కి డిజిటల్ రిలీజ్ బాగానే హెల్ప్ చేసింది అని చెప్పొచ్చు. సినిమా కి డిజిటల్ రేటు రిలీజ్ కి ముందు మొత్తం మీద 45 రోజుల అగ్రిమెంట్ తో 16 కోట్ల రేటు కి ఓకే చెప్పారు.
కానీ ఆ కండీషన్ కాకుండా రిలీజ్ అయిన 3 వారాలకి డిజిటల్ రిలీజ్ చేయడానికి ఓకే చెబితే మరో 8 కోట్లు ఎక్కువ ఇవ్వడానికి ప్రైమ్ వీడియో వాళ్ళు ముందుకు రాగా దిల్ రాజు 10 కోట్లకు బేరం కుదిర్చి సినిమా రిలీజ్ అయిన 21 వ రోజు డిజిటల్ రిలీజ్ అయ్యేలా చేశాడు. దాంతో సినిమా 16 కోట్లకి కంప్లీట్ అవ్వాల్సిన డీల్ మొత్తం మీద తక్కువ టైం కి టెలికాస్ట్ అవ్వడం తో రేటు పెరిగి…
మొత్తం మీద 26 కోట్ల డీల్ కి డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది వకీల్ సాబ్, ఆ రేటు ఎక్కువే అయినా వకీల్ సాబ్ కి డిజిటల్ లో ఇతర భాషల నుండి కూడా ఆడియన్స్ విరగబడి చూడటం తో వ్యూస్ సాలిడ్ గా వస్తున్నాయని తెలుస్తుంది, దాంతో రేటు ఎక్కువ పెట్టినా ప్రైమ్ వీడియో కి కూడా బాగానే రికవరీ అవుతుంది, ఇటు దిల్ రాజు కి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం ఎఫెక్ట్ అయినా డిజిటల్ రేటు తో అది కవర్ అయ్యింది అని చెప్పొచ్చు.