బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా వకీల్ సాబ్ సినిమా తో సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన విషయం తెలిసిందే. ఆల్ మోస్ట్ 3 ఏళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన ఈ సినిమా ఉన్నది తక్కువ టైం అయినా ఆ టైం లోనే సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, పవర్ స్టార్ సినిమా కి…
కంటెంట్ దక్కితే ఎలాంటి రచ్చ ఉంటుందో ఈ సినిమా మొదటి వారం లో చూపించింది, అలాంటి పవర్ స్టార్ స్టామినా పై టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రీసెంట్ గా ఆలీ ఈ టీవీ షో ఆలీ తో సరదాగా షో లో….
పవన్ కళ్యాణ్ కి ఎలాంటి కథ ని సిద్ధం చేస్తారు అని అడిగితె ఇలా సమాదానం ఇచ్చారు… “పవన్ కళ్యాణ్ కి కథ పెద్దగా అవసరం లేదు, ఆయన సినిమాలు జనాలు ఆయన్ని చూడటానికి వస్తారు, ఫైట్స్ ఉండాలి, పాటలు ఉండాలి అక్కడక్కడా పవన్ మ్యానరిజమ్స్ ఉండాలి…
అవి చాలు జనాలు థియేటర్స్ కి తరలి వచ్చేస్తారు, పవన్ కళ్యాణ్ ఒక డైనమెట్ లాంటోడు, చిన్న నిప్పు రవ్వ చాలు ఆయనికి, ఆయన సినిమాల సీన్స్ నే అక్కడక్కడా మూడు నాలుగు చోట్ల పెట్టి తీసినా జనాలు థియేటర్స్ కి వచ్చి చూస్తారు” అంటూ ఓ రేంజ్ లో ఎలివేషన్ లను ఇచ్చారు విజయేంద్ర ప్రసాద్. ఈ ఎలివేషన్ లో ఒకింత సత్యం ఉందని చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ సినిమాలకు టాక్ కి అతీతంగా ఫస్ట్ వీకెండ్ సెన్సేషనల్ కలెక్షన్స్ కన్ఫాం, ఇక టాక్ కూడా వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించే చాన్స్ ఎంతైనా ఉంటుంది, వకీల్ సాబ్ కి AP లో అడ్డంకులు, సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ లేకుండా ఉండి ఉంటే లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు చేసి ఉండేది సినిమా.