కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇయర్ సంక్రాంతి కానుకగా బరిలోకి దిగి సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. సినిమా తమిళ్ లోనే కాకుండా తెలుగు లో కూడా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేసే విజయాన్ని నమోదు చేసింది, కాగా సినిమా ను హిందీ లో కూడా డబ్ చేసి థియేటర్స్ లో….
రిలీజ్ చేశారు కానీ అక్కడ రెస్పాన్స్ ఏమాత్రం ఆశించిన విధంగా రాలేదు, హిందీ బిజినెస్ 4 కోట్ల దాకా పలకగా సినిమా అక్కడ మొత్తం మీద మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపలేక డిసాస్టర్ అయింది, హిందీ మార్కెట్ పాండమిక్ తర్వాత సెట్ అవ్వక పోవడం కూడా…
ఒక రీజన్ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు పరుగు కంప్లీట్ అయ్యాక డిజిటల్ లో హిందీ వర్షన్ కూడా రిలీజ్ అయ్యాక ఇప్పుడు హిందీ డబ్బింగ్ రేటు అందరికీ మైండ్ బ్లాంక్ చేసేలా ఉందని చెప్పొచ్చు. సినిమా కి హిందీ డబ్బింగ్ రేటు కింద ఏకంగా 14 కోట్ల రేంజ్ లో రేటు సొంతం అయిందట.
ఇది విజయ్ కెరీర్ లో అక్కడ రికార్డ్ అని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డిసాస్టర్ అయినప్పటికీ కూడా సినిమా కి హిందీ డబ్ వర్షన్ డిజిటల్ లో మంచి వ్యూవర్ షిప్ ని సొంతం చేసుకుందట, అందుకే డిసాస్టర్ అయినా కానీ ఈ రేంజ్ రేటు ని పెట్టి ఇప్పుడు త్వరలోనే టెలివిజన్ లో సినిమాను టెలికాస్ట్ చేయబోతున్నారట.
ఇక సినిమా తర్వాత యూట్యూబ్ లో కూడా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అవుతుందని సమాచారం. మొత్తం మీద బ్లాక్ బస్టర్ విజయం తో దుమ్ము లేపిన మాస్టర్ ఇప్పుడు హిందీ డబ్ వర్షన్ టెలివిజన్ లో పెట్టిన మమ్మోత్ రేటు కి ఎంతవరకు న్యాయం చేసేలా TRP రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు.