Home గాసిప్స్ ఇండస్ట్రీ పేరు పెంచిన డైరెక్టర్….కానీ తిడుతున్నారు…రీజన్ ఇదే!!

ఇండస్ట్రీ పేరు పెంచిన డైరెక్టర్….కానీ తిడుతున్నారు…రీజన్ ఇదే!!

0

ఒక్క సినిమాతో తన కెరీర్ ని మార్చుకోవడం ఒకెత్తు, టోటల్ ఇండస్ట్రీ క్రేజ్ ని పెంచడం మరో ఎత్తు, ఇలాంటి రేర్ ఫీట్ ని సౌత్ ఇండస్ట్రీలలో ఒకప్పుడు డైరెక్టర్ శంకర్ కోలివుడ్ క్రేజ్ ని పదింతలు పెంచితే, టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెలుగు సినిమా క్రేజ్ ని 20 రెట్లు పెంచాడు అని చెప్పొచ్చు. ఇక శాండల్ వుడ్ విషయానికి వస్తే అడపాదడపా హిట్స్ పడుతున్నా ఆ ఇండస్ట్రీ పేరు…

ఇండియా మొత్తం అయితే ఎప్పుడూ మారుమ్రోగి పోలేదు, కానీ 2018 ఇయర్ డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు ఊహకందని క్రేజ్ తో వచ్చిన ఒక్క సినిమా కన్నడ ఇండస్ట్రీ వరకు మాత్రమే సంచలనాలను సృష్టించలేదు ఏకంగా ఇతర ఇండస్ట్రీలలో కూడా ఓ రేంజ్ లో రచ్చ చేసింది…

తెలుగు లో తమిళ్ లో హిందీ లో ఈ సినిమా అద్బుతమైన విజయాన్ని నమోదు చేసింది, ఆ సినిమా విజయం ఎక్కువ క్రెడిట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి వెళ్ళింది, ఒక్క సినిమా తో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు ప్రశాంత్ నీల్, దాంతో కన్నడ ఇండస్ట్రీ పేరు మారుమ్రోగిపోయింది, కన్నడ ఆడియన్స్ ప్రశాంత్ నీల్ ని…

ఓ రేంజ్ లో మెచ్చుకుంటున్నారు, కట్ చేస్తే ఇప్పుడు అదే ఆడియన్స్ ప్రశాంత్ నీల్ ని ఛాన్స్ దొరికినప్పుడల్లా సోషల్ మీడియా లో తిడుతున్నారు. దానికి కారణం ప్రశాంత్ నీల్ అప్ కమింగ్ మూవీస్ అన్నీ కూడా ఇతర ఇండస్ట్రీ హీరోలతో ముఖ్యంగా టాలీవుడ్ హీరోలతో చేస్తూ ఉండటమే… ప్రభాస్, ఎన్టీఆర్ లతో సినిమాలు కమిట్ అయిన ప్రశాంత్ నీల్ తర్వాత…

అల్లు అర్జున్ రామ్ చరణ్ లతో కూడా సినిమాలు చేసే ఛాన్స్ ఉంది, దాంతో కన్నడ ఇండస్ట్రీ పేరు పెంచిన డైరెక్టర్ అయినా తర్వాత సినిమాలు కన్నడ హీరోలతో కాకుండా ఇతర ఇండస్ట్రీలతో చేస్తూ ఉండటం తో డైరెక్టర్ పై తీవ్ర కోపంగా ఉన్నారు వాళ్ళు, సోషల్ మీడియా లో కూడా చాలా సార్లే ట్రోల్ అయ్యాడు నీల్, కానీ ఎక్కడ సినిమాలు చేసినా కన్నడ డైరెక్టర్ గానే తనని గుర్తిస్తారు అన్న విషయం మర్చిపోతున్నారు వాళ్ళు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here