లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ లా ఇప్పుడు సెకెండ్ వేవ్ లో వరుస పెట్టి సినిమాలు ఏవి కూడా డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవ్వడం లేదు, లాస్ట్ ఇయర్ తో పోల్చితే చాలా తక్కువ సినిమాలకు మాత్రమే అనుకున్న రేటు లభించింది, కానీ ఎక్కువ సినిమాలు మట్టుకు బాక్స్ ఆఫీస్ దగ్గరే రిలీజ్ అవ్వాలని చూస్తున్నాయి. అందుకే సెకెండ్ వేవ్ లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమాల సంఖ్య….
చాలా తక్కువగా ఉంటూ రాగా పరిస్థితులు మరో నెల లోపు నార్మల్ అయ్యేలా కనిపిస్తూ ఉండటం తో థియేటర్స్ రీ ఓపెన్ కి రంగం సిద్ధం అవుతూ ఉంది, ఇలాంటి టైం లో సౌత్ ఇండస్ట్రీ తిరిగి తేరుకోవడం పెద్ద కష్టమేమి కాదని ఈ ఇయర్ మొదట్లోనే కన్ఫాం అయింది.
కానీ బాలీవుడ్ మాత్రం తేరుకోవడానికి ఎంత ట్రై చేసినా కానీ అనుకున్న విధంగా సినిమాలు రిలీజ్ కి సిద్ధం కాక పోవడం, రిలీజ్ అయినవి చిన్నవి అవ్వడంతో ఇంకా మొదటి హిట్ పడాల్సి ఉంది. ఇలాంటి టైం లో సెకెండ్ వేవ్ లో కూడా డైరెక్ట్ రిలీజ్ కోసం…
సెన్సేషనల్ రేటు ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ బెల్ బాటం సినిమా ను ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్లు కన్ఫాం చేశారు. 40 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడానికి ఏకంగా 130 కోట్ల మమ్మోత్ రేటు ని ఆఫర్ చేశాయి లీడింగ్ OTT యాప్స్…
అయినా కానీ అలాంటి ఆఫర్ కి నో చెప్పిన అక్షయ్ కుమార్ ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యి జులై 27 న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుందని కన్ఫాం చేశాడు. ఫస్ట్ వేవ్ నుండి ఇప్పటి వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఫస్ట్ బిగ్ ఫిల్మ్ ఇదే అవ్వడంతో బిగ్గెస్ట్ రిస్క్ తీసుకోబోతున్నాడు అక్షయ్ కుమార్.
అడ్డాల చేతులు జారిన రీమేక్!
టాలీవుడ్ లో ఫ్యామిలీ మూవీస్ తో ఎంట్రీ ఇచ్చి తక్కువ టైం లో తనకంటూ మంచి పేరు ను సొంతం చేసుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఒక్క సినిమా పరాజయంతో కెరీర్ లో ఆల్ టైం లోకి వెళ్లి పోయాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర 2016 లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా ఊహకందని డిసాస్టర్ అవ్వడం తో…
అడ్డాల కెరీర్ పై అది తీవ్రంగా ఇంపాక్ట్ చూపింది. దాంతో కెరీర్ లో మరో సినిమా చేయడానికి ఆల్ మోస్ట్ 4 ఏళ్ళు టైం తీసుకున్న అడ్డాల ఇప్పుడు అసురన్ రీమేక్ నారప్ప పనిలో బిజీగా ఉండగా ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతుండగా ఈ సినిమా తర్వాత అడ్డాల కి మరో రీమేక్ ఆఫర్ వచ్చింది.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ధనుష్ నటించిన కర్ణన్ సినిమా తెలుగు రీమేక్ ఆఫర్ శ్రీకాంత్ అడ్డాల కి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఎందుకనో సడెన్ గా ఈ సినిమా రీమేక్ ఆఫర్ శ్రీకాంత్ అడ్డాల నుండి వెళ్ళిపోయిందని అంటున్నారు. కారణం ఏంటి అనేది క్లియర్ గా చెప్పడం లేదు కానీ…
నారప్ప తర్వాత ఫ్రెష్ స్టొరీ ని డైరెక్ట్ చేయాలి అని శ్రీకాంత్ అడ్డాల భావించారట. కానీ సడెన్ గా ఈ రీమేక్ ఆఫర్ రావడం తో ముందు చేద్దామనే అనుకున్నా తర్వాత ఎందుకనో ఈ రీమేక్ ని వేరే డైరెక్టర్ చేతిలో పెట్టారని అంటున్నారు. మరి ఆ కొత్త డైరెక్టర్ ఎవరు అవుతారో, అడ్డాల తర్వాత సినిమా ఏమవుతుందో చూడాలి ఇక…