ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ ద్వారా రిలీజ్ అయిన సినిమా జగమే తంత్రం. ధనుష్ నటించిన ఈ సినిమా కి కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ వహించగా లోకల్ దాదా లండన్ డాన్ గా ఎలా మారాడు అన్న కాన్సెప్ట్ తో రూపొందిన జగమే తంత్రం సినిమా ఎప్పుడో లాస్ట్ ఇయరే షూటింగ్ మొత్తం పూర్తీ అయ్యి సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సింది కానీ ఫస్ట్ వేవ్ వలన పోస్ట్ పోన్ అవ్వగా…
థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక రిలీజ్ అవుతుంది అనుకున్నా సడెన్ గా సినిమా డైరెక్ట్ రిలీజ్ ను అనౌన్స్ చేశారు. ఇక సెకెండ్ వేవ్ లో సినిమా ను రీసెంట్ గా రిలీజ్ చేయగా సినిమాను చూసిన వాళ్ళు అందరూ కబాలి ని కమర్షియల్ టచ్ తో తీస్తే ఎలా ఉంటుందో…
ఈ సినిమా అలానే ఉందంటూ విమర్శలు ట్రోల్స్ గట్టిగానే మొదటి రోజుకే సొంతం చేసుకుంది. ధనుష్ రీసెంట్ టైం లో చేసిన వీకేస్ట్ మూవీ ఇదే అంటూ కూడా చెప్పుకొచ్చారు. గ్యాంగ్ స్టర్ లైఫ్ స్టొరీ అయిన ఈ సినిమా ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ మొత్తం…
నీరు గార్చే విధంగా ఉండగా అయినా కానీ సినిమా కి ఫస్ట్ డే అద్బుతమైన వ్యూవర్ షిప్ లభించిందని అంటున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఫస్ట్ డే ఇండియా లో ఆల్ టైం హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న సినిమాగా ఈ సినిమా నిలిచింది అంటున్నారు. వ్యూస్ లెక్కలు బయటికి చెప్పకున్నా ఇండియా లో నెట్ ఫ్లిక్స్ లో…
హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకుందని, అలాగే వరల్డ్ వైడ్ గా కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను ఈ సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. ఇండియా లో నెట్ ఫ్లిక్స్ యూసర్స్ తక్కువే అయినా ఓవరాల్ గా సాలిడ్ వ్యూవర్ షిప్ తో సినిమా మంచి స్టార్ట్ ను సొంతం చేసుకుంది. ఇక లాంగ్ రన్ ఎలా ఉంటుందో చూడాలి.