మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ డిసాస్టర్ల తర్వాత ఈ ఇయర్ క్రాక్ సినిమా తో సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని రవితేజ కెరీర్ లోనే నంబర్ 1 మూవీ గా నిలిచింది. ఇక సాలిడ్ బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ తర్వాత రవితేజ ఖిలాడీ సినిమా తో ఫుల్ బిజీగా ఉండగా…
ఈ సినిమా ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా రావాల్సింది కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన ఇప్పుడు కొంత గ్యాప్ తో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక ఈ సినిమా కోసం రవితేజ భారీ రెమ్యునరేషన్ నే తీసుకోబోతుండగా ఈ సినిమా ను మించి కూడా…
అప్ కమింగ్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ కి రెమ్యునరేషన్ కెరీర్ లోనే హైయెస్ట్ అనిపించే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు ఇప్పుడు. ఖిలాడీ సినిమా కి రెమ్యునరేషన్ కింద 9 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న రవితేజ తర్వాత మూవీ ని కొత్త డైరెక్టర్ శరత్ డైరెక్షన్ లో 90 కాలం నాటి కథ తో…
సరికొత్త వింటేజ్ లుక్ తో నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కి గాను రవితేజ రెమ్యునరేషన్ అలాగే నైజాం ఏరియా రైట్స్ ని తీసుకోబోతున్నట్లు సమాచారం. మొత్తం మీద రెండూ కలిపి రవితేజ ఆల్ మోస్ట్ 15 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని అందుకోబోతున్నాడట. ఇది రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ రేటు గా చెబుతున్నారు.
ఇక ఈ సినిమా కోసం కూడా తక్కువ డేట్స్ నే ఇచ్చాడట రవితేజ… 30 రోజుల కాల్ షీట్స్ కే ఈ రేంజ్ రెమ్యునరేషన్ ని తీసుకోబోతుండటం విశేషం.. ఇక ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే మొదలు కాబోతుందని, సినిమా వచ్చే ఇయర్ ఆడియన్స్ ముందుకు రానుందని అంటున్నారు. మరి రవితేజ ఈ సినిమా తో వింటేజ్ రవితేజని తిగిరి ఫుల్లుగా గుర్తు చేయడం ఖాయమని చెప్పొచ్చు.