పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ పవర్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. బాహుబలి తో వచ్చిన క్రేజ్ ఆ ఒక్క సినిమాకే పరిమితం కాదని సాహో సినిమా తో నిరూపించాడు. డిసాస్టర్ టాక్ తో కూడా ఆ సినిమా హిందీ లో సూపర్ హిట్ గా నిలవగా ఓవరాల్ గా 70% వరకు రికవరీ చేసి సెన్సేషన్ ని క్రియేట్ చేసి ప్రభాస్ రేంజ్ ఏంటో చూపెట్టింది.
ఇక సాహో తర్వాత ప్రభాస్ రాధే శ్యామ్ తో బిజీగా ఉండగా ఈ సినిమా తర్వాత కమిట్ అయిన కొత్త సినిమా KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ ని అనౌన్స్ చేయగా ఈ సినిమా ను వచ్చే ఇయర్ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు…
అఫీషియల్ గా అనౌన్స్ చేయగా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండగా రీసెంట్ గా సినిమా డిజిటల్ రైట్స్ హక్కులు సాలిడ్ రేటు ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. లీడింగ్ OTT యాప్ అయిన అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం భారీ ఆఫర్ ని కోట్ చేశారట.
కాగా సౌత్ భాషలలో తెలుగు తమిళ్ కన్నడ కలిపి ఈ సినిమా కోసం ఏకంగా 135 కోట్ల ఆఫర్ ను కోట్ చేసినట్లు చెబుతున్నారు. మూడు భాషల కోసం ఈ రేంజ్ ఆఫర్ అంటే అరాచకం అనే చెప్పాలి. ఇంకా ఇతర భాషలు ముఖ్యంగా హిందీ కూడా బాలెన్స్ ఉండటం తో రేటు ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
కానీ మేకర్స్ ప్రస్తుతానికి ఇంకా ఏ ఆఫర్ ను కూడా కన్సిడర్ చేయడం లేదని తెలుస్తుంది. అంటే రేటు ఇంకా ఎక్కువ రావాలని ఎక్స్ పెర్ట్ చేస్తున్నారని అనుకోవచ్చు. ఏది ఏమైనా అరాచకం అనిపించే ఈ రేటే తక్కువ అనిపిస్తే సినిమా రేంజ్ ఏ లెవల్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు ఇక.