కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరోల్లో ఇలయ దళపతి విజయ్ కూడా ఒకరు. మిగిలిన కోలివుడ్ యాక్టర్స్ తో పోల్చితే తెలుగు లో ముందు అనుకున్న రేంజ్ మార్కెట్ సొంతం కాక పోయినా కానీ ఎప్పటి కప్పుడు ప్రయత్నాలు మానని విజయ్ ఎట్టకేలకు తన రీసెంట్ మూవీస్ తో తెలుగు లో స్టేబుల్ మార్కెట్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాడు.
ఇక ఇప్పుడు రిలీజ్ అయ్యే అన్ని సినిమాలు క్వాలిటీ పరంగానే కాదు కంటెంట్ పరంగా కూడా మరింత జాగ్రత్తలు తీసుకుంటూ తెలుగు ఆడియన్స్ ని దృష్టి లో పెట్టుకోబోతున్నాడు విజయ్, ప్రస్తుతం బాక్ టు బాక్ 4 హిట్స్ తర్వాత విజయ్ చేస్తున్న కొత్త సినిమా బీస్ట్…
కొత్త డైరెక్టర్ నెల్సన్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండగా సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ హై రేంజ్ క్వాలిటీ తో తీస్తున్నారట. అందుకోసం బడ్జెట్ ని కూడా భారీగా పెడుతున్నారని సమాచారం. విజయ్ రీసెంట్ మూవీస్ అన్నీ కూడా 120 కోట్లకి పైగానే బడ్జెట్ తో తీయగా….
ఈ సినిమా ను కూడా అదే రేంజ్ బడ్జెట్ తో తీస్తున్నారట. ఆల్ మోస్ట్ 160 కోట్ల రేంజ్ బడ్జెట్ తో ఈ సినిమా ఉండబోతుందని కోలివుడ్ మీడియా చెబుతుంది. ఇందులో రెమ్యునరేషన్ పరంగా 50 కోట్లు విజయ్ కి వెళ్ళగా తర్వాత సినిమా బిజినెస్ అయిన తర్వాత ప్రాఫిట్ షేర్ వెళుతుందని, మొత్తం మీద 80-90 కోట్లు రెమ్యునరేషన్ ఉంటుందని అంటున్నారు.
ఈ రేంజ్ బడ్జెట్ అంటే పాన్ ఇండియా మూవీస్ నే తీస్తారు చాలా మంది, కానే తమిళ్ మూవీ కే ఈ రేంజ్ బడ్జెట్ అంటే మాత్రం మెంటల్ మాస్ అనే చెప్పాలి. తెలుగు ఆడియన్స్ యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం కాబట్టి ఈ సినిమాని సెలెక్ట్ చేసుకున్నారట. మరి ఈ సినిమా విజయ్ తెలుగు మార్కెట్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు…