ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఉంటాయి, అందుకే ఆ బ్యానర్ నుండి పెద్ద సినిమాలను నిర్మిస్తూ చిన్న మీడియం రేంజ్ మూవీస్ ని అప్పుడప్పుడు ఎక్స్ పెరి మెంటల్ మూవీస్ ని మాత్రం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పేరున నిర్మిస్తుండగా ఆ సినిమాలు కూడా ఆడియన్స్ ను ఇప్పటి వరకు బాగానే అలరించి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలు గా నిలిచాయి.
కానీ మొదటి సారి దెబ్బ పడినట్లు ఈ ఇయర్ లో వచ్చిన కార్తికేయ లావణ్య త్రిపాటి ల కాంబినేషన్ లో రూపొందిన చావు కబురు చల్లగా సినిమా ఈ బ్యానర్ లో మొదటి ఫ్లాఫ్ మూవీ గా నిలిచింది. కొత్త కాన్సెప్ట్ తో ఎక్స్ పెరి మెంటల్ గా తెరకెక్కిన ఈ సినిమా…
ఆడియన్స్ టేస్ట్ ను అందుకోలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని తర్వాత స్టార్ మా ఛానెల్ సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమాను టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు. కాగా సినిమా…
ఫస్ట్ టైం టెలికాస్ట్ చేసినప్పుడు కేవలం 5.1 రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పేరు వలన సినిమా కి ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కులను తీసుకున్నప్పటికీ కూడా సినిమా టెలివిజన్ లో కూడా ఆశించిన రేటింగ్ ను సొంతం చేసుకోవడం లో విఫలం అయింది. ఇంత కన్నా పాత సినిమాలు కొన్ని చిన్న డబ్బింగ్ మూవీస్…
ఇంకా బెటర్ రేటింగ్ లను టెలివిజన్ లో సొంతం చేసుకున్నాయి. ప్రైమ్ టైం లో మధ్యాహ్నం సమయం లో టెలికాస్ట్ అయినప్పటికీ TRP తక్కువగానే వచ్చింది. దాంతో అటు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా నిరాశ పరిచి అదే ఫాం ని టెలివిజన్ లో కూడా కొనసాగించడం విచారకరం అనే చెప్పాలి. ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడు అనుకున్న కార్తికేయ ఫ్లాఫ్స్ పరంపర కొనసాగుతుంది.