మనీ ప్రాబ్లమ్స్ వలనో, యాక్టర్స్ కి డైరెక్టర్ కి మధ్య సమస్యల వలనో లేదా ఇంకా ఏమైనా కారణం కావొచ్చు కానీ కొన్ని సినిమాలు మొదలు అవ్వడం భారీగా మొదలు అయినా ఆడియన్స్ ముందుకు రావడానికి మాత్రం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది… కొన్ని సినిమాలు ఎన్నో కష్టాలు పడి ఆడియన్స్ ముందుకు వస్తే చాలా సినిమాలు కష్టాలు తట్టుకోలేక లాబ్స్ కే పరిమితం అవుతూ ఉంటాయి. అలా ఉన్న సినిమాల్లో కొన్ని….
తిరిగి టైం వచ్చినప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాయి, ఇప్పుడు ఈ కోవలోకి వచ్చే సినిమానే మూడేళ్ళ క్రితం సందీప్ కిషన్ అరవింద్ స్వామి శ్రేయ లాంటి మంచి స్టార్ కాస్ట్ తో డిఫెరెంట్ జానర్ లో రూపొందిన నరకాసురుడు సినిమా.. మూడేళ్ళ క్రితమే అన్ని పనులు….
పూర్తీ చేసుకుని ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ సినిమా అనేక కారణాల వలన రిలీజ్ కి నోచుకోలేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఏమి లేకపోవడంతో లాబ్ కే పరిమితం అయిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ OTT రిలీజ్ అనుకున్నా సెట్ కాలేదు కానీ ఈ ఇయర్ OTT కి సిద్ధం అవుతుంది.
మూడేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా తమిళ్ అండ్ తెలుగు రైట్స్ రెండింటిని కూడా సోనీ లైవ్ వాళ్ళు సొంతం చేసుకున్నారని సమాచారం. 4.1 కోట్ల రేటు కి ఈ సినిమా రెండు భాషల రైట్స్ ని సొంతం చేసుకున్నారని ట్రేడ్ లో టాక్ ఉంది. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమాకి ఇంత రేటు పలకడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
కానీ స్టార్ కాస్ట్ ఎక్కువ ఉన్నందున ఈ రేటు మరీ నిర్మాతలను తేరుకునే రేంజ్ లో లేకున్నా ఇంకా ఆగితే ఈ మాత్రం రేటు కూడా కష్టమే కాబట్టి ఈ రేటుకే సినిమాను అమ్మేశారని అంటున్నారు. ఇక సినిమా ఆగస్టు 15 వీకెండ్ లో డిజిటల్ రిలీజ్ కాబోతుందని అంటున్నారు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి ఇక.