Home న్యూస్ మారుతి…మంచిరోజులొచ్చాయి….ఎన్ని రోజుల్లో ఫినిష్ అయిందో తెలుసా?

మారుతి…మంచిరోజులొచ్చాయి….ఎన్ని రోజుల్లో ఫినిష్ అయిందో తెలుసా?

0

చేసింది తక్కువ సినిమాలే అయినా ఆడియన్స్ లో తన సినిమాలంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసుకున్న దర్శకులలో మారుతి ఒకరు, కెరీర్ మొదట్లో ఎస్టబ్లేష్ అవ్వడానికి ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న మూవీస్ ని చేసిన మారుతి తర్వాత ప్రేమ కథా చిత్రం కథని అందించి మెప్పించగా, భలే భలే మోగాడివోయ్, మహానుభావుడు, ప్రతీ రోజూ పండగే లాంటి సినిమాలతో తిరుగు లేని విజయాలను సొంతం చేసుకున్నాడు.

ప్రతీ రోజూ పండగే సినిమా తర్వాత కొత్త సినిమాను మొదలు పెట్టడానికి చాలా టైం ని తీసుకున్న మారుతి అసలు సినిమాలు ఏమి ఎందుకు అనౌన్స్ చేయడం లేదు అనుకున్న టైం లో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను అనౌన్స్ చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ టైం లో….

సెకెండ్ వేవ్ ఎంటర్ అవ్వడం తో షూటింగ్ కి మళ్ళీ గ్యాప్ రాగా ఈ గ్యాప్ లో కొత్త కథలను రాసుకుంటున్నట్లు చెప్పిన మారుతి సడెన్ గా ఓ కొత్త సినిమా పోస్టర్ ని రిలీజ్ చేశారు, ఆ సినిమానే మంచిరోజులొచ్చాయి. అందరూ ఈ సినిమా అనౌన్స్ చేశారేమో అనుకున్నారు కానీ…

ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో ఉండి కుదిరితే ఆడియన్స్ ముందుకు అతి త్వరలో రావడానికి కూడా సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఇంత ఫాస్ట్ గా ఈ సినిమా ఎప్పుడు అయిందో కూడా తెలియదు కానీ సినిమా ఇంట్రో టీసర్ లో క్వాలిటీ మాత్రం అదిరిపోయింది అని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమా కథని 20 రోజుల్లో రాసుకుని సినిమా మొత్తం షూటింగ్ ను 30 రోజుల వర్కింగ్ డేస్ లో కంప్లీట్ చేశాడట మారుతి…అందుకే సినిమా అంత త్వరగా అయిందని అంటున్నారు. UV కాన్సెప్ట్ క్రియేషన్ లో నిర్మాణం అవుతున్న ఈ సినిమా అతి త్వరలో థియేటర్స్ లో రానుంది. మరి సినిమా మారుతి ప్రీవియస్ మూవీస్ లానే ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here