తమిళ్ తో పాటు తెలుగు లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోల్లో కార్తీ కూడా ఒకరు, తెలుగు లో ఆల్ మోస్ట్ స్ట్రైట్ హీరోలకి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో కార్తీ కి కూడా అలాంటి రెస్పాన్స్ ఉంటుంది ఆడియన్స్ నుండి. ఈ మధ్య కాలంలో పెద్దగా ఫామ్ లో లేకున్నా ఖైదీ సినిమా తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు కార్తీ…
ఇక తర్వాత దొంగ డిసాస్టర్ అయినా ఈ ఇయర్ వచ్చిన సుల్తాన్ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకున్నా సెకెండ్ వేవ్ దెబ్బ అలాగే వకీల్ సాబ్ దెబ్బ తో తెలుగు లో ఆశించిన సక్సెస్ ను అందుకోలేదు. ఖైదీ తర్వాత కార్తీ కి మరో అద్బుతమైన రోల్ ఒకటి…
పడాల్సింది కానీ అది మిస్ చేసుకుని దొంగ మరియు సుల్తాన్ సినిమాలను చేశాడు కార్తీ… ఆ సినిమా మరేదో కాదు రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు డిజిటల్ లో రిలీజ్ అయిన ఆర్య నటించిన సార్పట్ట పరంపర సినిమా.. ఈ సినిమా దర్శకుడు పా రంజిత్ కార్తీ తోనే…
కెరీర్ ని మద్రాస్ అనే సినిమా తో మొదలు పెట్టాడు. తర్వాత రజినీతో బాక్ టు బాక్ ఫ్లాఫ్ మూవీస్ ని తీసిన టైం లో కంబ్యాక్ కోసం కార్తీకి ఈ సినిమా కథని వినిపించగా రోల్ అద్బుతంగా నచ్చినా కానీ కమిట్ మెంట్స్ ఎక్కువగా ఉండటం ఈ సినిమా కోసం బాక్సింగ్ ట్రైనింగ్ లాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉండటం తో డేట్స్ అడ్జస్ట్ అవ్వక…
ఈ రోల్ ను ఒప్పుకోలేక పోయాడట కార్తీ… దాంతో కార్తీ ప్లేస్ లో ఫ్లాఫ్స్ లో ఉన్న ఆర్య ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వగా ఇప్పుడు ఆర్యకి ఈ సినిమా తో అద్బుతమైన పేరు వస్తుంది కోలివుడ్ అండ్ టాలీవుడ్ నుండి. కార్తీ చేసి ఉంటే ఈ పాటికే థియేటర్స్ లో వచ్చి ఉండేది, తన కెరీర్ కి మరో హైలెట్ అయ్యేది ఈ సినిమా, అలాంటి సినిమాను మిస్ చేసుకున్నాడు కార్తీ..