కొన్ని కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆడక పోయినా తర్వాత మాత్ర్రం ఆ సినిమాలకు డిజిటల్ లో కానీ టెలివిజన్ లో కానీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. రిలీజ్ అయినప్పుడు ఆడక పోవడం వెనక అనేక కారణాలు ఉంటాయి. ఇలా రిలీజ్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయ్యి తర్వాత ఆడియన్స్ మెప్పుని టెలివిజన్ లో డిజిటల్ లో సొంతం చేసుకున్న సినిమాల్లో గోపీచంద్ నటించిన…
గౌతమ్ నంద సినిమా కూడా ఒకటి అని చెప్పాలి. సంపత్ నంది డైరెక్షన్ లో గోపీచంద్ నటించిన ఈ సినిమా అప్పట్లో ఓవర్ బడ్జెట్ ఇబ్బందులో ఉండగా అయినా కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ 20 కోట్లకు పైగా సొంతం చేసుకుంది. కానీ పరుగును మొత్తం మీద 11 కోట్ల రేంజ్ లోనే…
సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. సినిమా కి బాగుంది అనిపించే టాక్ వచ్చినా కానీ గోపీచంద్ అప్పటికే వరుస పెట్టి ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో వచ్చిన సినిమా అవ్వడం తో ఎంత బాగుంది అన్నా కానీ ఆడియన్స్ లో….
రీచ్ ని సొంతం చేసుకోలేక పోయింది ఈ సినిమా…. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయిన ఈ సినిమాను తర్వాత డిజిటల్ లో అండ్ టెలివిజన్ లో వేసిన ప్రతీ సారి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండగా రీసెంట్ గా సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు అయిన సందర్బంగా డైరెక్టర్ సంపత్ నంది సినిమా ను మళ్ళీ గుర్తు చేసుకోగా…
సోషల్ మీడియా లో ఇంతమంచి సినిమా అసలు ఎలా ఫ్లాఫ్ అయిందో అంటూ కామెంట్స్ చాలా వచ్చాయి. ఒక్క గౌతమ్ నంద అనే సినిమానే కాదు ఇలా చాలా సినిమాలు రిలీజ్ టైం లో పెద్దగా ఆడియన్స్ ను మెప్పించక పోయినా తర్వాత మాత్రం మంచి రెస్పాన్స్ ను డిజిటల్ లో టెలివిజన్ లో సొంతం చేసుకున్నాయి. గోపీచంద్ లాస్ట్ 4-5 ఇయర్స్ లో ఇది హిట్ అవ్వాల్సిన సినిమా కానీ ఫ్లాఫ్స్ ఎఫెక్ట్ వలన ఇది కూడా ఫ్లాఫ్ అయింది.