బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ పాండమిక్ తర్వాత వరుస పెట్టి సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తుండగా బాలీవుడ్ లో మాత్రం ఆల్ మోస్ట్ ఏడాదిన్నర తర్వాత ఓ బిగ్ హీరో నటించిన సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆ సినిమానే అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటం మూవీ. మంచి రివ్యూలను కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా ఆడియన్స్ ను తిరిగి భారీ లెవల్ లో థియేటర్స్ కి తిరిగి రప్పిస్తుంది అనుకున్నా కానీ…
నాసిరకం కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ రెండు రోజుల్లో 5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని ఇండియా లో సొంతం చేసుకుంది. ఇక మరో పక్క టాలీవుడ్ చిన్న సినిమా రాజా రాజ చోర బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా…
ఈ రెండు సినిమాలు ఓవర్సీస్ లో మట్టుకు నువ్వా నేనా అన్నట్లు కలెక్షన్స్ పరంగా జోరు చూపుతున్నాయి. 130 కోట్ల రేంజ్ OTT ఆఫర్ వచ్చినా కానీ నో చెప్పి థియేటర్స్ లో రిలీజ్ అయిన బెల్ బాటం రెండు రోజుల్లో అమెరికాలో $63,894 డాలర్స్ ని వసూల్ చేసింది.
ఈ సినిమాతో పోల్చితే 4 కోట్ల రేంజ్ బడ్జెట్ లోనే తెరకెక్కిన రాజ రాజ చోర సినిమా మాత్రం $50,121 డాలర్స్ ను రెండు రోజుల్లో సొంతం చేసుకుంది. ఓ రీజినల్ చిన్న సినిమా తన బడ్జెట్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ బడ్జెట్ అండ్ వైడ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమా తో పోటి పడుతూ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం.
లాంగ్ రన్ లో కచ్చితంగా రాజ రాజ చోర సినిమా లీడ్ ను అక్కడ సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక రాజ రాజ చోర తెలుగు రాష్ట్రాలలో 2 రోజుల్లో కోటి రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుందట. ఇక వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.