లాస్ట్ వీక్ ఆడియన్స్ ముందుకు వచ్చిన తెలుగు మూవీస్ లో ఎంతో కొంత పబ్లిసిటీ తో రిలీజ్ అయిన సినిమాల్లో డియర్ మేఘ సినిమా కూడా ఒకటి, కన్నడ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన దియా సినిమా తెలుగు రీమేక్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఒరిజినల్ కి సీన్ టు సీన్ కాపీ పేస్ట్ లా ఉండటం దానికి తోడూ సినిమా రిలీజ్ కి కొన్ని రోజుల ముందే…
ఒరిజినల్ వర్షన్ ని యూట్యూబ్ లో తెలుగు లో డబ్ చేసి మరీ రిలీజ్ చేయడం తో ఒరిజినల్ తెలుగు డబ్ ఉండగా థియేటర్స్ కి వెళ్లి రీమేక్ ని చూడటానికి ఎంత మంది ఇష్టపడతారు చెప్పండి… ఇప్పుడు అదే జరిగి సినిమా ను చూడటానికి జనాలు ఏమాత్రం ఆసక్తిని….
చూపక పోవడం తో ఓపెనింగ్ రోజు నుండే ఎక్కడా కూడా మినిమమ్ కలెక్షన్స్ ని సాధించలేక పోయిన డియర్ మేఘ సినిమా ఆల్ మోస్ట్ తెలుగు రాష్ట్రాలలో 130 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్నా కానీ మొదటి రోజు నుండే డెఫిసిట్ లు అలాగే నెగటివ్ షేర్స్ ని…
సొంతం చేసుకుంటూ అతి కష్టం మీద వీకెండ్ ని పూర్తీ చేసుకోగా ఓవరాల్ గా 3 రోజుల వీకెండ్ లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 13 లక్షల షేర్ ని అలాగే వరల్డ్ వైడ్ గా 14 లక్షల షేర్ ని 25 లక్షల దాకా గ్రాస్ ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీసేస్తే ఇక షేర్ కూడా ఏమి మిగిలి ఉండదు అని చెప్పాలి.
మొత్తం మీద సినిమాను ఓన్ గానే రిలీజ్ చేశారట మేకర్స్… బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణమైన ఓపెనింగ్స్ ను సాధించిన ఈ సినిమాకి ఒరిజనల్ వర్షన్ డబ్ అయ్యి రిలీజ్ అవ్వడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అయింది అని చెప్పాలి. అలా జరగక పోయి ఉంటే ఇంకొంచం కలెక్షన్స్ ని అయినా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఉండేది..