సినిమా వాళ్ళు ప్రమోషన్స్ కోసం సినిమా పోస్టర్ ల పై కలెక్షన్స్ ఈ రేంజ్ లో వచ్చాయి ఆ రేంజ్ లో వచ్చాయి అంటూ చెప్పడం చాలా సినిమాల విషయంలో ఫేక్ అనే తేలింది.. వచ్చిన కలెక్షన్స్ ఒకటి అయితే చెప్పే కలెక్షన్స్ పోస్టర్ లు ఓ రేంజ్ లో ఉండటం లాంటివి ఫేక్ అని చెప్పినా ఫ్యాన్స్ అలాంటివి ఏమి పట్టించుకోకుండా అవే నిజం అని నమ్ముతారు, కానీ ఇప్పుడు అఫీషియల్ గా…
నిర్మాతలే ఆ కలెక్షన్స్ ఫేక్ అంటూ ఒప్పుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్లు నార్మల్ చేయాలనీ, 100% ఆక్యుపెన్సీ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం తో మాట్లాడానికి రీసెంట్ గా టాలీవుడ్ పెద్దలు వెళ్ళారు, అక్కడ పలు చర్చలు జరగగా నిర్మాత సి కళ్యాణ్ ఇది వరకు ఒక కేంద్ర మంత్రి దగ్గరకు కొన్ని…
రిక్వెస్ట్ లతో వెళ్ళినప్పుడు మీ సినిమా వాళ్ళు 200 కోట్ల పోస్టర్ లు లాంటివి ఈ రేంజ్ లో వేయడం మళ్ళీ మా హెల్ప్ కోసం రావడం ఏంటి అని అడగడం తో అప్పుడు చెప్పిన నిజాన్ని ఇప్పుడు మళ్ళీ చెప్పారు నిర్మాత సి కళ్యాణ్… మంత్రి పేర్ని నానితో మాట్లాడు…
సినిమా వాళ్ళు 200 కోట్లు-600 కోట్లు లాంటి పోస్టర్ లు వేసేది…మేం ప్రజల్ని మోసం చేయడానికి…అబ్బో ఈ సినిమా చూడకపోతే మిస్ అవుతామేమో అని ప్రజలు అనుకునేలా చేయడానికి…కొన్ని ఆడినవి కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు… పబ్లిసిటీ కోసం పోస్టర్ లు వేసి జనాలను మోసం చేస్తామని ఓపెన్ గా చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ ఉంది…
ఫేక్ కలెక్షన్స్ టాపిక్ ఇప్పుడు అనవసరం కానీ జనాల్ని మోసం లాంటి పదాలు వాడకుండా ఉంటే బాగుండేది. ఇక ప్రభుత్వం చర్చలు జరిపిన తర్వాత ప్రభుత్వం చాలా వరకు సానుకూలంగా స్పందించిందని తెలుస్తుంది. టికెట్ రేట్లు నార్మల్ తర్వాత కానీ రోజుకి 4 షోలు, 100% ఆక్యుపెన్సీ పై త్వరలోనే ఒక అనౌన్స్ మెంట్ రాబోతుందని సమచారం. ఇక ఈ 200 కోట్ల ఫేక్ పోస్టర్స్ పై ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.