నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబో లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ నుండి హైయెస్ట్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, 2 రోజుల్లో టాలీవుడ్ నంబర్ 1 మూవీ గా నిలిచిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల వీకెండ్ లో 38.5 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది…
మూవీ యూనిట్ 50 కోట్లు అంటూ ప్రచారం కోసం పోస్టర్ లు రిలీజ్ చేసినా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ మార్క్ ని ఇంకా అందుకోవాల్సి ఉంది, సినిమా నాలుగో రోజు భారత్ బంద్ వలన కొంచం అడ్వాంటేజ్ కలిసి వచ్చింది కానీ భారీ వర్షాలు ఇబ్బందులు పెట్టాయి.
అయినా కానీ సినిమా భారీ వర్షాలను కూడా తట్టుకుని చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులతో దుమ్ము లేపింది. దాంతో ఇప్పుడు 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా వసూల్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 43.5 కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుండగా ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ లెక్క 44 కోట్ల మార్క్ ని కూడా అందుకోవడం లేదా మించి ముందుకు వెళ్ళడం జరగోచ్చు. ఇక సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా అమెరికాలో 1 మిలియన్ మార్క్ ని…
క్రాస్ చేసిన సినిమా సెకెండ్ వేవ్ తర్వాత ఫస్ట్ ఇండియన్ మూవీ గా అమెరికాలో 1 మిలియన్ మార్క్ తో సంచలనం సృష్టించింది, ఇక లాంగ్ రన్ లో అక్కడ రెట్టించిన జోరు చూపెట్టే అవకాశం ఉంది, ఇక 4 రోజులకు గాను బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…