యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ అనుభవించు రాజా… బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ రెస్పాన్స్ ఇనీషియల్ గా వస్తూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 600 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ను….
సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా అన్ సీజన్ ఎఫెక్ట్ అయితే అన్ని చోట్లా కంటిన్యూ అవుతుంది అని చెప్పాలి… నవంబర్ నెలని అన్ సీజన్ గా భావిస్తారు కాబట్టి ఈ ఇంపాక్ట్ ఈ సినిమా పై కూడా కనిపించింది. తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్….
450 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 15% రేంజ్ లో ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ మరీ అనుకున్న రేంజ్ లో ఇంప్రూవ్ అవ్వకపోయినా కానీ మొత్తం మీద 20% కి పైగా ఓవరాల్ గా…
ఆక్యుపెన్సీ కంటిన్యూ అయ్యింది అని చెప్పాలి. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఇప్పుడు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 40 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ ను అందుకునేలా కనిపిస్తుంది. కానీ అన్ని చోట్ల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఓవరాల్ గా 50 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి.
ఒకవేళ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 50-60 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ ను అందుకుంటే బాగా ఓపెన్ అయ్యింది అని చెప్పొచ్చు. వీకెండ్ లో స్ట్రాంగ్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనాలను మించి ఉంటాయా లేక అంచనాల కన్నా తక్కువ ఉంటాయో అన్నది చూడాలి ఇక.