బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ వారం ప్రతీ నెల చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కానీ అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటాయి. అదే టైం లో ప్రతీ నెలలో రిలీజ్ అయ్యే సినిమాల్లో ఒకటి రెండు మాత్రమే ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకుని ఆ నెల కి హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగలవు. టాలీవుడ్ లో ఇప్పుడు ఇలాంటి రికార్డ్ నే నట సింహం నందమూరి బాలకృష్ణ….
నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అఖండ సినిమా సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు డిసెంబర్ నెలకి గాను టాలీవుడ్ నుండి హైయెస్ట్ షేర్ ని వసూల్ చేసిన సినిమా గా అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసుకుంది అని చెప్పాలి.
టాలీవుడ్ లో డిసెంబర్ నెలని అన్ సీజన్ గానే భావిస్తారు… అలాంటి డిసెంబర్ లో 5 ఏళ్ల క్రితం డీమానిటైజేషన్ జరిగిన కొన్ని వారాలకే రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ సినిమా ఆ టైం లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించి 58.5 కోట్ల షేర్ ని అందుకుంది.
అలాంటి సెన్సేషనల్ కలెక్షన్స్ తర్వాత 5 ఏళ్ళుగా డిసెంబర్ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాగా ధృవ సినిమా టాప్ లో ఉండగా ఇప్పుడు ఎట్టకేలకు 5 ఏళ్ల తర్వాత డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయిన అఖండ సినిమా ఇప్పుడు 60 కోట్లకు పైగా షేర్ తో డిసెంబర్ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ మూవీగా సంచలనం సృష్టించింది… ఆ టైం లో డీమానిటైజేషన్ ఉంటే…
ఈ టైం లో ఆంధ్రలో టికెట్ రేట్లు లేవు, బెనిఫిట్ షోలు లేవు, స్పెషల్ షోలు లేవు, పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వాలంటే భయపడుతున్న టైం లో అఖండ ఇప్పుడు సంచలన రికార్డ్ తో దుమ్ము దుమారం చేసిందని చెప్పాలి. కానీ మరో వారంలో రాబోతున్న పుష్ప సినిమా ఈ రికార్డ్ ను అందుకుని డిసెంబర్ లో టాపర్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. కానీ అప్పటి వరకు అఖండ టాప్ ప్లేస్ ని ఎంజాయ్ చేయబోతుంది.