నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు అన్నీ కూడా మిగిలిన ఏరియాలతో పోల్చితే రాయలసీమ ఏరియాలో లెక్కలు మించి కలెక్షన్స్ పరంగా సంచలనం సృష్టించాయి. రాయలసీమలో బాలయ్యకి అలాంటి క్రేజ్ ఉంది కాబట్టి ఈ రేంజ్ కలెక్షన్స్ ప్రతీ సినిమాకి వచ్చాయి కానీ మిగిలిన ఏరియాల్లో అందరికీ స్ట్రాంగ్ జోన్ లా ఉండే నైజాం ఏరియా లో మాత్రం బాలయ్య సినిమాలు ఎందుకనో ఫస్ట్ నుండి కూడా….
అంచనాలను అందుకునే రేంజ్ లో అయితే కలెక్షన్స్ ని సాధించలేదు. సింహా లెజెండ్ లాంటి సినిమాలు కూడా రాయలసీమలో మరింత భారీగా కలెక్షన్స్ ని అందుకోవడంతో నైజాం ఏరియా ఔట్ షైన్ అయింది అని చెప్పాలి. ఓవరాల్ గా నైజాం ఏరియా బాలయ్య కి వీక్ ఏరియా కింద…
కౌంట్ చేసేవాళ్ళు కానీ కట్ చేస్తే ఇప్పుడు అఖండ సినిమా రాయలసీమ లో ఏ రేంజ్ లో కుమ్మిందో టికెట్ హైక్స్ ఉన్నా కానీ నైజాం ఏరియాలో ఇదే రేంజ్ లో కుమ్మి పెట్టిన రేటు ని వీకెండ్ లోనే తిరిగి తీసుకుని వచ్చి లాభాల బాట పట్టించి ఈ ఒక్క ఏరియాలోనే…
డిస్ట్రిబ్యూటర్లకి ఊహకందని ప్రాఫిట్స్ ను తెచ్చి పెట్టి రీసెంట్ గా ఈ ఏరియాలో ఏకంగా 30 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది. సెకెండ్ వేవ్ తర్వాత ఇది బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ గా చెప్పుకోవాలి, అది కూడా నైజాం ఏరియాలో సెకెండ్ వేవ్ తర్వాత సినిమాల ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేని టైం లో బరిలోకి దిగిన అఖండ సినిమా…
అప్ కమింగ్ మూవీస్ అన్నింటికీ కూడా భారీగా హోప్స్ ని ఇచ్చింది అని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో రచ్చ చేసిన సినిమా అతి త్వరలో అన్నీ అనుకున్నట్లు జరిగితే బాలయ్య కెరీర్ లో మొట్ట మొదటి సారి గా నైజాం ఏరియా లో 20 కోట్ల షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అది 3rd వీకెండ్ టైం కి సొంతం అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.