యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ ని సాలిడ్ హిట్స్ తో మొదలు పెట్టాడు, ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావ, కుమారి 21F… ఇలా అద్బుతమైన ఆరంభాన్ని అతి కొద్ది మంది మాత్రమే సొంతం చేసుకుంటారు, అలాంటిది రాజ్ తరుణ్ కి సొంతం అయినా తర్వాత కెరీర్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేక పోయాడు. వరుస పెట్టి ఫ్లాఫ్స్ తో వచ్చిన మార్కెట్ మొత్తం డౌన్ అయిపోగా… ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ…
బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ మాత్రం సొంతం అవ్వలేదు, కానీ రీసెంట్ టైం లో ఎంతో కొంత హోప్స్ పెంచిన సినిమాగా అనుభవించు రాజా ట్రైలర్ తో ఆకట్టుకోగా సినిమా కూడా టైం పాస్ మూవీ అని పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది ఈ సినిమా కి…
కానీ నవంబర్ అన్ సీజన్ ఎఫెక్ట్ గట్టిగా ఉండటం, రాజ్ తరుణ్ ఫ్లాఫ్స్ లో ఉండటం లాంటివి గట్టి ఇంపాక్ట్ చూపి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఆశించిన కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేక పోయింది ఈ సినిమా. ఒకసారి సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ లెక్కలను ఏరియాల వారిగా గమనిస్తే…
👉Nizam: 74L
👉Ceeded: 41L
👉UA: 24L
👉East: 18L
👉West: 13L
👉Guntur: 17L
👉Krishna: 15L
👉Nellore: 11L
AP-TG Total:- 2.10CR(3.35CR~ Gross)
Ka+ROI: 8L
OS – 7L
Total WW: 2.25CR(3.80CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్క… ఉన్నంతలో ఇవి కూడా పర్వాలేదు….
అనిపించే రేంజ్ కలెక్షన్స్ అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ అవ్వాలి అంటే సినిమా 4 కోట్ల దాకా వసూళ్లు అందుకోవాల్సి ఉండగా టోటల్ గా సాధించిన కలేక్షన్స్స్ ఆ మార్క్ కి చాలా దూరంలో ఉండటం తో మరోసారి నిరాశ ఎదురు అవ్వక తప్పలేదు రాజ్ తరుణ్ కి… ఏదైనా పెద్ద మూవీస్ లేని ఓ బెటర్ టైం లో రిలీజ్ చేసి ఉంటే రిజల్ట్ కొంచం బెటర్ గా ఉండేది.