Home న్యూస్ లాస్ట్ మినట్ లో దెబ్బ మీద దెబ్బ…ఏంటి సామి ఇది!

లాస్ట్ మినట్ లో దెబ్బ మీద దెబ్బ…ఏంటి సామి ఇది!

1

ఒక పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాను ఆన్ టైం కి ఎలాగైనా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలీజ్ చేయడానికి మేకర్స్ అండ్ టీం ఎంతో కష్టపడుతున్నారు కానీ కొన్ని అవరోధాలు చివరి నిమిషంలో ఇంకా ఎఫెక్ట్ చూపుతూనే ఉన్నాయి. ఫైనల్ ప్రింట్ ఓవర్సీస్ లో అందరికీ చేరడానికి టైం పట్టగా ఇప్పటికి పరిస్థితులు అక్కడ సెట్ అవ్వగా ఇతర భాషల్లో కొన్ని చోట్ల ఇబ్బందులు ఇంకా కొనసాగుతుండగా…

ఇదంతా సజావుగా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఫేస్ చేస్తున్న టీం కి మరో పక్క అంధ్రప్రదేశ్ ప్రభుత్వం చుక్కలు చూయిస్తుంది. టికెట్ హైక్స్ పర్మీషన్ అడిగితె నో చెప్పగా… కొందరు థియేటర్స్ ఓనర్స్ కోర్టులో కేసు వేయడంతో ఆ నిర్ణయం సోమవారానికి వాయిదా పడగా అన్ని థియేటర్స్ ని చెక్ చేసి క్వాలిటీ లేని థియేటర్స్ పై ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు…

మరో పక్క టికెట్ హైక్స్ లేక బెనిఫిట్ షోలు అయినా ఇస్తారు అనుకుంటే ఎట్టి పరిస్థితులలో రోజుకు 4 షోలకు మించి వేయరాదు, వేస్తె థియేటర్స్ మూసేస్తాం అంటూ గట్టి వార్నింగ్ ఇవ్వగా మల్టీప్లెక్సులలో అయినా షోలు పెంచుకుందాం అనుకుంటే ఇప్పుడు అక్కడ కూడా 4 షోలు మించి వేస్తె థియేటర్స్ మూసేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా ప్రతీ చోట దెబ్బ మీద దెబ్బ ఇండస్ట్రీకి పుష్ప సినిమా కి పడుతుంది…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here