Home న్యూస్ పుష్ప రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

పుష్ప రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అలాగే రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ లు కలిసి చేసిన సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్ 1 ఆడియన్స్ ముందుకు భారీ అంచనాలన నడుమ ఎట్టకేలకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది ఎంత వరకు ఆకట్టు కుందో లాంటి విశేషాలను తెలుసు కుందాం పదండీ…

ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…. రెడ్డి బ్రదర్స్(అజయ్ ఘోష్-ధనంజయ్) గ్యాంగ్ గ్రూప్‌లో పని చేసే రోజువారీ కూలీ అయిన పుష్పరాజ్ అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తుంటారు. పుష్ప ఒక మామూలు కూలీ నుండి రెడ్డి బ్రదర్స్‌తో పాటు కో ఓనర్ గా ఎదిగే స్టేజ్ కి వచ్చిన పుష్పరాజ్ తర్వాత….

మంగళం సూరి (సునీల్) ని ఫేస్ చేయాల్సి వస్తుంది….మామూలు కూలీ నుండి సిండికేట్ కి డాన్ గా ఓ మామూలు కూలీ ఎలా ఎదిగాడు, తనని పట్టుకోవడానికి వచ్చిన భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాసిల్) తో తర్వాత ఏమయింది. ఇంతకీ హీరోయిన్ రష్మికతో హీరో లవ్ స్టొరీ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

కథగా చెప్పాలి… ఫస్ట్ టైం సుకుమార్ సినిమాలో ఇంత సింపుల్ కథతో ఎలాంటి స్పెషాలిటీ లేకుండా సినిమా వచ్చిందా అనిపించే లెవల్ లో అతి సాధారణమైన కథతో వచ్చిన పుష్ప సినిమా కోర్ కథ పాయింట్ ఏమాత్రం ఇంప్రెస్ చేయలేదు కానీ ఎంచుకున్న బ్యాగ్ డ్రాప్ రా రస్టిక్ నేపధ్యం అవ్వడం, అందరూ డీగ్లామరైజ్ రోల్స్ లో కనిపించడంతో…

ఆసక్తిని పెంచినా కానీ ఆ ఆసక్తిని సినిమా మొత్తం క్యారీ చేయలేక పోయింది. ఎలాగోలా ఫస్టాఫ్ వరకు కథ పడుతూ లేస్తూ సాగి అల్టిమేట్ ఇంటర్వెల్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగి, సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం అదే రేంజ్ హై ఫీల్ ఇచ్చేలా స్టార్ట్ అయినా కానీ తర్వాత గాడి తప్పింది… తర్వాత సీన్ ని ఆడియన్స్ ఎప్పుడైతే…

ఈజేగా చెప్పేస్తాడో అప్పుడు సినిమా లో అయితే ఎంటర్ టైన్ మెంట్ లేదా హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ లేదా హీరోయిజం సీన్స్ లాంటివి పడితే బాలెన్స్ అవుతుంది… ఇక్కడ కొన్ని సీన్స్ పడ్డా కానీ సినిమా లెంత్ మరీ ఎక్కువ అవ్వడంతో సెకెండ్ ఆఫ్ బోర్ కొట్టడం స్టార్ట్ అవుతుంది. ఇక హీరో ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటూ….

డాన్ అవ్వడంతో అప్పుడు ఫహద్ ఫాసిల్ సీన్ లోకి ఎంటర్ అవుతాడు… అక్కడ నుండి మరో లెవల్ సీన్స్ ని ఎక్స్ పెర్ట్ చేస్తారు అందరూ కానీ సింపుల్ సీన్స్ తో ఆ 30 నిమిషాల సీన్స్ ని ఎండ్ చేసి పార్ట్ 2 పై అంచనాలు ఓ మోస్తరుగా పెరిగేలా చేశారు కానీ అది కూడా ఆడియన్స్ ఊహించుకున్నదే….

ఓవరాల్ గా కథలో చాలా ఫ్లాస్ ఉన్నాయి, లెంత్ మరీ ఎక్కువ అయింది, దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ లో నిరాశ పరిచింది…. విలన్స్ బ్యాచ్ అసలు పవర్ ఫుల్ లానే అనిపించకపోవడం, కొన్ని చోట్ల డబ్బింగ్ సెట్ కాక పోవడం, గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండటం లాంటివి మైనస్ పాయింట్స్ అయినా కానీ…

ఒక్క అల్లు అర్జున్ మాత్రం కోసం ఎంత కష్ట పడాలో అంత కష్ట పడ్డాడు… తన లుక్స్, డైలాగ్స్, మ్యానరిజమ్స్, హీరోయిజం ఇలా సినిమా మొత్తాన్ని తన భుజాన మోశాడు, ఈ సారి అదిరిపోయే స్టెప్స్ ప్లేస్ లో సింపుల్ స్టెప్స్ తోనే తన స్టైల్ ని చూపెట్టాడు.. తన పెర్ఫార్మెన్స్ సినిమా కి బిగ్గెస్ట్ అసెట్…. డైరెక్టర్ గా సుకుమార్ కూడా షైన్ అవ్వని…

చోట కూడా నటుడిగా అల్లు అర్జున్ చాలా సీన్స్ లో మెప్పించాడు… మొత్తం మీద ఇది తన వన్ మాన్ షో… రష్మిక జస్ట్ ఓకే అనిపించింది… ఫహద్ ఫాసిల్ కూడా పర్వాలేదు, సునీల్ విలనిజం మిస్ ఫైర్ అయినట్లు అనిపించింది. మిగిలిన యాక్టర్స్ ఉన్నంతలో ఆకట్టుకున్నారు… పాటలు వినడానికి ఎంత బాగున్నాయో చూడటానికి కూడా అంతే బాగా ఆకట్టుకున్నాయి.

బ్యాగ్రౌండ్ స్కోర్ నిరాశ పరిచింది… ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఇక సుకుమార్ రంగస్థలం మ్యాజిక్ ని మళ్ళీ రిపీట్ చేయలేక పోయాడు. అల్లు అర్జున్ కోసం, కొన్ని హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్, సాంగ్స్ కోసం ఒకసారి చూడొచ్చు… అంచనాలు ఓ రేంజ్ లో పెంచుకుని వెళితే నిరాశ తప్పదు… అయినా కానీ అల్లు అర్జున్ పడ్డ కష్టానికి సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here