బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప నైజాం లో ఫస్ట్ డే ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది, కానీ మైండ్ బ్లాంక్ అయ్యే దెబ్బ ఆంధ్రలో లో టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు లేక పోవడం, 4 షోలు మాత్రమే ఉండటం తో కలెక్షన్స్ పై తీవ్రమైన ఇంపాక్ట్ పడింది. ఒక ఏరియాలో ఇండస్ట్రీ రికార్డ్ వచ్చినా ఓవరాల్ గా చూసుకుంటే మట్టుకు గట్టి దెబ్బే పడింది కలెక్షన్స్ కి…
అవలీలగా ఫస్ట్ డే 30 కోట్లకు చేరుకోవాల్సిన సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్, ఆంధ్రలో ఉన్న పరిస్థితుల వలన 25 లోపే ఆగిపోయాయి. అందులో కూడా వర్త్ హైర్స్ యాడ్ అవ్వగా అవి తీసేస్తే ఫస్ట్ డే షేర్ 22 కోట్ల రేంజ్ లో సొంతం అయ్యింది సినిమా కి…
కానీ అదే టైం లో హిందీ లో కానీ, తమిళ్ లో కానీ ఓవర్సీస్ లో కానీ సినిమా సాలిడ్ పెర్ఫార్మెన్స్ ని చూపెట్టి దుమ్ము లేపింది. ఆంధ్రలో పరిస్థితులు బాగుండి…. కరెక్ట్ టైం కి సినిమా రిలీజ్ అయ్యి ఉంటే కలెక్షన్స్ ఊచకోత మరో విధంగా ఉండి ఉండేది బాక్స్ ఆఫీస్ దగ్గర…
అయినా కానీ మొత్తం మీద మొదటి రోజు ఇప్పుడు సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కని ఒకసారి గమనిస్తే..
👉Nizam: 11.44Cr
👉Ceeded: 4.20Cr(1.12Cr)
👉UA: 1.8Cr
👉East: 1.43Cr(33L hires)
👉West: 1.5Cr(61L Hires)
👉Guntur: 2.28Cr(1.55Cr Hires)
👉Krishna: 1.15Cr
👉Nellore: 1.10Cr(21L hires)
AP-TG Total:- 24.90CR(35.5CR~ Gross)(3.82Cr Hires)
👉Karnataka: 3.65Cr
👉Tamilnadu: 1.82Cr
👉Kerala: 1.21Cr
👉Hindi: 1.66Cr
👉ROI: 1Cr
👉OS – 4.25Cr**
Total WW: 38.49CR(63CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమాను టోటల్ గా 144.9 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 107.51Cr షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.