బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప సినిమా రెండో రోజు అందరి అంచనాలను కూడా ఓ రేంజ్ లో మించిపోయింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు అనుకున్న కలక్షన్స్ ని మించి పోయి కొత్త రికార్డులతో మెంటల్ మాస్ అనిపించే రేంజ్ లో హోల్డ్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేయడం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో 10-11 కోట్ల రేంజ్ లో…
కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా అంతకుమించి కలెక్షన్స్ వచ్చే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని కూడా అంచనా వేసినప్పటికీ ఆ అంచనాలను కూడా మించిపోయిన సినిమా ఓవరాల్ గా రెండో రోజు కి వచ్చే సరికి ఏకంగా 13.7 కోట్ల షేర్ తో చరిత్ర తిరగరాసింది.
ఇక రెండో రోజు వరల్డ్ వైడ్ గా 15-16 కోట్ల రేంజ్ షేర్ ని సినిమా సొంతం చేసుకుంటుంది అనుకుంటే ఏకంగా 20 కోట్ల షేర్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
👉Nizam: 18.84Cr(inc GST)
👉Ceeded: 6.22Cr
👉UA: 3.05Cr
👉East: 2.19Cr
👉West: 2.02Cr
👉Guntur: 2.83Cr
👉Krishna: 1.92Cr
👉Nellore: 1.53Cr
AP-TG Total:- 38.60Cr(56CR~ Gross)
👉Karnataka: 4.9Cr
👉Tamilnadu: 3.05Cr
👉Kerala: 1.55Cr(Corrected)
👉Hindi: 3.35Cr
👉ROI: 1.4Cr
👉OS – 6.05Cr**
Total WW: 58.90CR(94CR~ Gross)
ఇదీ సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.
సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 144.9 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొత్తం మీద 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 87.10 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో బ్యాటింగ్ చేస్తే మరిన్ని సంచలనాలు నమోదు అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.