ఈ ఇయర్ వరుస పెట్టి సినిమాలు మళ్ళీ ఆడియన్స్ ముందుకు క్యూలు కడతాయి అని అంతా ఆశగా ఎదురు చూశారు కానీ సమ్మర్ వరకు సాలిడ్ గానే రిలీజ్ అయిన సినిమాలు తర్వాత సెకెండ్ వేవ్ ఇంపాక్ట్ తో దెబ్బ పడింది. మళ్ళీ ఆగస్టు టైం నుండి సినిమాల రిలీజ్ లు మొదలు అవ్వగా పెద్ద సినిమాలు రావడానికి డిసెంబర్ దాకా టైం పట్టింది. ఇక ఈ ఇయర్ లో చాలా మంది హీరోలకు…
కంబ్యాక్ లు దక్కాయి. కానీ అన్నింటిలో కూడా స్పెషల్ మాస్ కంబ్యాక్ మాత్రం ఇయర్ మొదట్లో రవితేజ కి ఇయర్ ఎండ్ టైం కి బాలయ్య కి సొంతం అయ్యాయి అని చెప్పాలి. ఇయర్ పొడవునా మరికొన్ని కంబ్యాక్ లు ఉన్నప్పటికీ వీళ్ళ కంబ్యాక్ చాలా స్పెషల్ అనే చెప్పాలి…
ఇద్దరి కెరీర్ లో ఊహకందని డిసాస్టర్ మూవీస్ వరుస పెట్టి రావడంతో మార్కెట్ ని చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. అలాంటి టైం లో ఇయర్ మొదట్లో రవితేజ క్రాక్ సినిమా రిలీజ్ రోజు కూడా అనేక అవరోధాలను సొంతం చేసుకోవాల్సి వచ్చినా రిలీజ్ అయ్యాక సంచలన విజయాన్ని నమోదు చేసింది.
అదే టైం లో బాలయ్య కూడా భారీ డిసాస్టర్ల తర్వాత ఇక బాలయ్య మార్కెట్ డౌన్ అయిపొయింది అనుకున్న టైం లో అఖండతో అఖండ మైన విజయాన్ని సొంతం చేసుకుని వన్ ఆఫ్ ది బెస్ట్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు. ఇలా ఈ ఇద్దరూ ఈ ఇయర్ కంబ్యాక్స్ లో బెస్ట్ కంబ్యాక్స్ ని సొంతం చేసుకున్న హీరోలు అని చెప్పాలి.
మధ్యలో అల్లరి నరేష్ నాందితో, గోపీచంద్ సీటిమార్ తో కంబ్యాక్ కొట్టారు. ఇక పవన్ చాలా గ్యాప్ తో వకీల్ సాబ్ తో దుమ్ము లేపినా పవన్ క్రేజ్ ఎప్పుడూ తగ్గలేదు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి లేదు…. కానీ రవితేజ అండ్ బాలయ్య ల కంబ్యాక్ చాలా గట్టిగా రీ సౌండ్ వచ్చేలా దుమ్ము లేపింది అని చెప్పాలి.