ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఇప్పుడు పూర్తీ చేసుకోబోతుండగా సినిమా కి 7 వ రోజు మరోసారి ఎదురుదెబ్బలు తప్పలేదు, ఆంధ్రలో థియేటర్స్ లో టికెట్ రేట్స్ వలన చాలా ఏరియాల్లో మూసేయ్యాల్సి రావడం సినిమా కలెక్షన్స్ పై మరింత ఎఫెక్ట్ చూపగా వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన డ్రాప్స్ కూడా గట్టిగానే సొంతం చేసుకున్న పుష్ప సినిమా మొత్తం మీద…
7 వ రోజు 6వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 30% నుండి 35% వరకు డ్రాప్ అవ్వగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా జస్ట్ ఓకే అనిపించుకునే విధంగా ఉండగా థియేటర్స్, షోలు, రేట్లు తగ్గిపోవడం లాంటివి మరింత ఇబ్బంది పెడుతూ ఉండటం తో ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
1.2 కోట్ల రేంజ్ వసూళ్లు సాధించే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే లెక్క 1.3 కోట్ల నుండి 1.4 కోట్ల దాకా వెళ్ళొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా ఈ రోజు 2.5 కోట్ల నుండి 2.6 కోట్ల దాకా కలెక్షన్స్ రావొచ్చు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో అఫీషియల్ గా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.