ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని ఇప్పుడు పూర్తీ చేసుకుంది… సినిమాను భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా రిలీజ్ రోజునే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా వీకెండ్ లో మాత్రం ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసి దుమ్ము దులిపేసింది. కానీ తర్వాత వర్కింగ్ డేస్ లో…
సినిమా కొద్దిగా స్లో డౌన్ అవ్వక తప్పలేదు. అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఇతర భాషల్లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని మొదటి వారంలో అందుకుని 100 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది..
ఇక సినిమా 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1.39 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది అని చెప్పాలి. కానీ సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఈ కలెక్షన్స్ సరిపోవు కానీ ఆంధ్రలో ఉన్న పరిస్థితులలో ఇవి మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమా ఇప్పుడు…
మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 32.78Cr(inc GST)
👉Ceeded: 11.19Cr
👉UA: 5.90Cr
👉East: 3.93Cr
👉West: 3.26Cr
👉Guntur: 4.24Cr
👉Krishna: 3.44Cr
👉Nellore: 2.50Cr
AP-TG Total:- 67.24CR(101.65CR~ Gross)
👉Karnataka: 8.81Cr
👉Tamilnadu: 7.31Cr
👉Kerala: 3.48Cr
👉Hindi: 12.71Cr
👉ROI: 2.05Cr
👉OS – 10.85Cr
Total WW: 112.45CR(196.40CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమాను మొత్తం మీద 144.9 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద మొదటి వారం తర్వాత క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే ఇంకా 33.55 కోట్ల షేర్ ని సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.