ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తీ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుంది కానీ ఉన్నంతలో బాగానే హోల్డ్ చేసింది అనే చెప్పాలి. సినిమా కి పోటిగా శ్యామ్ సింగ రాయ్ ఉండటం తో ఆ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ ఉన్నంతలో సినిమా 8 వ రోజు మొత్తం మీద…
7 వ రోజు తో పోల్చితే 20% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తిరిగి ఈవినింగ్ షోల నుండి బాగానే పుంజుకుంటూ ముందుకు వెళుతుంది. దాంతో ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1 కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ లో కలక్షన్స్ ని సొంతం చేసుకునే…
అవకాశం ఉందని చెప్పాలి. అంతకన్నా ముందుకు వెళితే సినిమా సాలిడ్ గా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2.5 కోట్ల నుండి 2.7 కోట్ల మధ్యలో షేర్ ని అందుకోవచ్చు. మరి సినిమా అఫీషియల్ గా ఈ రేంజ్ వసూళ్ళని అందుకుంటుందా లేక ఇంతకంటే ఎక్కువ వసూళ్లు సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…