బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప పార్ట్ 1 మరో సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ రోజునే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా సోషల్ మీడియాలో కంప్లీట్ నెగటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో అన్న డౌట్ ఉన్నా ఆంధ్రలో లో టికెట్ రేట్స్ ఎఫెక్ట్ ఉన్నా కానీ….
ఓవరాల్ గా నైజాంలో స్ట్రాంగ్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం వలన మొత్తం మీద బాగానే వసూళ్లు సాధించినా రెండు తెలుగు రాష్ట్రాల ఆవల అల్టిమేట్ వసూళ్లు సాధించడం సినిమాకి కలిసి వచ్చింది. మొదటి వారం తర్వాత ఇప్పుడు సినిమా 8 వ రోజు సాధించిన వసూళ్ళతో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా…
సినిమా 200 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలనం సృష్టించింది. సినిమా ఆల్ రెడీ తెలుగు లో 100 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకోగా మిగిలిన చోట్ల వసూళ్ళతో ఇప్పుడు హిస్టారికల్ 200 కోట్ల గ్రాస్ మార్క్ ని ఈ టాక్ తో అందుకోవడం మాస్ అనే చెప్పాలి.
సినిమా 7 రోజుల్లో 196 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 1.8 కోట్ల నుండి 2 కోట్ల దాగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా 8 వ రోజు వరల్డ్ వైడ్ గా 4 కోట్ల కి అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా ఇప్పుడు 8 రోజుల్లో…
టోటల్ వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. అల్లు అర్జున్ కెరీర్ లో బాక్ టు బాక్ 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా ఒక నార్మల్ మూవీ ఒక పాన్ ఇండియా మూవీతో బాక్ టు బాక్ 200 కోట్లు అందుకోవడం పుష్ప ఇలాంటి టాక్ తో అందుకోవడం విశేషం అనే చెప్పాలి.