బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ క్రిస్టమస్ వీకెండ్ ని పూర్తీ చేసుకున్న శ్యామ్ సింగ రాయ్, పుష్ప మరియి అఖండ సినిమాలు ఇప్పుడు వర్కింగ్ డే లో ఎంటర్ అయ్యాయి. హాలిడే తర్వాత వర్కింగ్ డే లో డ్రాప్స్ హెవీగా ఉంటాయి కాబట్టి ఆ ఇంపాక్ట్ గట్టిగానే ఉంది అన్ని సినిమాల మీద కూడా… శ్యామ్ సింగ రాయ్ 4వ రోజు మరో వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా సినిమా ఈ రోజు…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 55% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. దాంతో ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా 1.6 కోట్ల నుండి 1.7 కోట్ల రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే…
లెక్క కొంచం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక 11 వ రోజు లో ఎంటర్ అయిన పుష్ప ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 50% కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, మాస్ సెంటర్స్ హోల్డ్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్న క్లాస్ సెంటర్స్ డ్రాప్స్…
కొంచం ఎక్కువ గానే ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల నుండి 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. అంతకన్నా ఎక్కువ వసూళ్లు సాధిస్తే సినిమా ఉన్నంతలో మంచి వసూళ్ళనే సాధించింది అనుకోవచ్చు. ఇక లాంగ్ రన్ లో ఇప్పటికీ దుమ్ము లేపుతున్న అఖండ సినిమా….
26వ రోజు కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని హోల్డ్ చేయబోతుంది. సినిమా ఈ రోజు రెండు తెలుగు ఆల్ మోస్ట్ 40% వరకు డ్రాప్ అవ్వగా ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా 22 లక్షల నుండి 25 లక్షల మధ్యలో షేర్ ని అందుకోవచ్చు. మరి ఓవరాల్ గా అన్ని సినిమాల వర్కింగ్ డే కలెక్షన్స్ ఈ మార్క్ ని అందుకుంటాయా లేక మించుతాయో చూడాలి.