బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప సెన్సేషనల్ కలెక్షన్స్ జోరు కొనసాగుతుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి 118.33 కోట్ల గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 229 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇక సినిమా ఇప్పుడు 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 2.5 కోట్ల నుండి 2.7 కోట్ల అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే…
అవకాశం ఎంతైనా ఉండగా… అంతకుమించి ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎంతైనా ఉంది. ఇక హిందీలో మరోసారి 2.5 కతోల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు. టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజున 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకోవచ్చు.
దాంతో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 11 రోజుల్లో 235 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలలో 120 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది. నెగటివ్ టాక్ తో ఆంధ్రలో భారీ లాస్ లు కన్ఫాం అయినా ఓవరాల్ గా ఈ రేంజ్ వసూళ్ళని అందుకోవడం నిజంగానే సెన్సేషన్ అని చెప్పాలి.