అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని ఇప్పుడు నమోదు చేసుకుని బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ షేర్ ని వసూల్ చేసిన సినిమాగా సంచలన రికార్డ్ ను నమోదు చేయగా డైరెక్టర్ బోయపాటి శ్రీను కెరీర్ లో సరైనోడు సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ వసూళ్ళని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది. అలాంటి ఈ సినిమా రిలీజ్ అయ్యాక…
ఇలాంటి రికార్డులను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నప్పటికీ కూడా రిలీజ్ కి ముందు ఇటు బాలయ్య కానీ అటు బోయపాటి కానీ వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న ఎఫెక్ట్ వలన సినిమా పై గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. సినిమాను ముందు లో బడ్జెట్ లో అనుకున్నారు కానీ…
సినిమా షూటింగ్ జరుగుతున్న కొద్దీ సినిమా పై కాన్ఫిడెంట్స్ పెరగడంతో బడ్జెట్ పెరుగుతూ పోయింది… మధ్యలో ఫస్ట్ వేవ్ అండ్ సెకెండ్ వేవ్ లు ఎఫెక్ట్ చూపడంతో బడ్జెట్ మొత్తం చేతులు దాటేసిందని, అంత ఎలా రికవరీ అవుతుందో లేదో అన్న డౌట్స్ కూడా ఉన్నప్పటికీ ఔట్ పుట్ పై నమ్మకంతో…
సినిమాను ఆడియన్స్ ముందుకు తెచ్చే టైం లో బడ్జెట్ పైన మొత్తం మీద జరిగిన బిజినెస్ పోను 22.5 కోట్ల డెఫిసిట్ లో సినిమాను రిలీజ్ చేయాల్సి వచ్చిందని సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తెలియజేశారు… కానీ ఒక్క సారి సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని, అటు కలెక్షన్స్ పరంగా సినిమా రెచ్చిపొతే బిజినెస్ పరంగా మిగిలిన పనులు కూడా..
అద్బుతంగా సాగి ఇప్పుడు సినిమా ద్వారా మంచి లాభాలు సొంతం అయ్యాయి అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత. బాలయ్య-బోయపాటిలు ఫ్లాఫ్స్ లో ఉన్నా వాళ్ళ మీద భారీ బడ్జెట్ ని పెట్టి 22.5 కోట్ల డెఫిసిట్ లో సినిమాను రిలీజ్ చేసి ఇప్పుడు అల్టిమేట్ హిట్ ని అందుకోవడం విశేషం అనే చెప్పాలి. సినిమా లాంగ్ రన్ లో ఇంకా ముందుకు పోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.