బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు బాగుంటే ఇంకా రాంపేజ్ సాలిడ్ గా ఉండేది ఏమో కానీ పరిస్థితులు ఎదురుదెబ్బ కొట్టడంతో ఆంధ్రలో తీవ్రమైన నష్టాలను సొంతం చేసుకోబోతున్న పుష్ప సినిమా ఇతర రాష్ట్రాలలో ఆ నష్టాలను కవర్ చేసుకుని ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తుంది. సినిమా ఇప్పుడు రెండు వారాలను పూర్తీ చేసుకోవడానికి సిద్ధంగా ఉండగా వర్కింగ్ డేస్ లో తెలుగు లో…
సినిమా కి డ్రాప్స్ కొంచం హెవీగానే ఉన్నాయి అని చెప్పాలి. సినిమా 10 వ రోజు తర్వాత వర్కింగ్ డేస్ లో క్రమంగా స్లో అవుతూ రాగా 13 వ రోజు మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్ అయిన సినిమా 42 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా సొంతం చేసుకుంది.
కానీ అదే టైం లో సినిమాకి హిందీ లో అల్టిమేట్ హోల్డ్ దక్కడం వలన ఇక్కడ డ్రాప్ అయినా కానీ అక్కడ గ్రోత్ వలన సినిమా ఓవరాల్ గా మరోసారి మంచి షేర్స్ ని సొంతం చేసుకుంది కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకాస్త జోరు పెంచాల్సిన అవసరం ఉంది.
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 13 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 38.34Cr(Without GST 35.30Cr)
👉Ceeded: 13.31Cr
👉UA: 7.31Cr
👉East: 4.48Cr
👉West: 3.69Cr
👉Guntur: 4.73Cr
👉Krishna: 3.88Cr
👉Nellore: 2.88Cr
AP-TG Total:- 78.62CR(121.68CR~ Gross)
👉Karnataka: 10.30Cr
👉Tamilnadu: 8.47Cr
👉Kerala: 4.65Cr
👉Hindi: 21.85Cr
👉ROI: 2.15Cr
👉OS – 12.68Cr
Total WW: 138.72CR(244CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమాను మొత్తం మీద 144.9 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 146 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద సినిమా 13 రోజులు పూర్తీ అయ్యే టైం కి బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 7.28 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది. ఆంధ్రలో అయితే ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.