మల్టీ ప్లెక్సులలో సినిమాల టికెట్ రేట్లు సినిమాల రేంజ్ ని బట్టి పెంచులోవచ్చు అని, ఇది సింగల్ స్క్రీన్స్ లో కూడా అమలు అవుతుంది కానీ రేట్లు ఓవరాల్ గా మల్టీ ప్లెక్సులలో ఎక్కువగా పెంచుకోవచ్చు అంటూ రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా పుష్ప సినిమాకి ఈ పద్దతిలోనే టికెట్ రేట్స్ ని పెంచారు. కాగా ఇప్పుడు ఆ రేట్లని కూడా మించిపోయి భారీ రేట్లని ఆర్ ఆర్ ఆర్ కి పెట్టబోతున్నారు…
మల్టీ ప్లెక్సులలో ఇది వరకు సినిమాల రేంజ్ ని బట్టి 200, 250 వరకు రేట్లు ఉండగా రీసెంట్ గా 300 వరకు రేట్లు పెంచుకోవచ్చు అంటూ నిర్ణయం తీసుకోగా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాకి GST అండ్ ఇతర టాక్సులు కాకుండా 295 గా టికెట్ రేటుని ఫిక్స్ చేయగా…
GST తో కలిపి 350 వరకు టికెట్ రేటు ఉండబోతుందని సమాచారం. ఇక సింగిల్ స్క్రీన్స్ లో 200 వరకు ఉండబోతుంది, ఏసియన్ థియేటర్స్ లో 175 నుండి 200 వరకు ఉండబోతుండగా PVR లో 350 వరకు టికెట్ రేట్లు ఉండబోతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ కి లో క్లాస్ టికెట్ రేట్లు 100 నుండి 120 రేంజ్ లో ఉండబోతున్నాయట. కలెక్షన్స్ ఓ రేంజ్ లో వస్తాయి కానీ జనాలు ఈ రేంజ్ లో డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారో లేదో చూడాలి.