బాక్స్ ఆఫీస్ దగ్గర న్యూ ఇయర్ వీకెండ్ స్టార్ట్ అయింది కానీ సినిమాల మీద ఆ ఇంపాక్ట్ మరీ అనుకున్న రేంజ్ లో అయితే లేదు అనే చెప్పాలి అండ్ తెలంగాణలో టికెట్ హైక్స్ విపరీతంగా పెంచడం కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపింది. కొత్త సినిమా అర్జున ఫాల్గుణ మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపలేక పోయింది. సినిమా ఇప్పుడు మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద చూసుకుంటే…
20-25 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే చాలా చోట్ల హై టికెట్ రేట్స్ వలన డెఫిసిట్ లు కూడా పడ్డాయి. ఇక రెండో వీక్ లో ఎంటర్ అయిన శ్యామ్ సింగ రాయ్ సినిమా ఆల్ మోస్ట్ 7 వ రోజు లెవల్ లో…
పెర్ఫార్మ్ చేస్తుండగా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఈ రోజు మొత్తం మీద 30 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక మూడో వీక్ లో ఎంటర్ అయిన పుష్ప సినిమా 15 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 14 వ రోజు…
లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా ఈ రోజు 1.3 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం హిందీలో ఇంకా జోరు చూపితే ఇంకా షేర్ పెరిగే అవకాశం ఉంది. ఇక నాలుగు వారాలను పూర్తీ చేసుకుని 5 వ వారంలో ఎంటర్ అయిన…
బాలయ్య అఖండ సినిమా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులతో దుమ్ము లేపగా ఈ రోజు కూడా సినిమా 29 వ రోజు లెవల్ లో 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, మొత్తం మీద అన్నీ సినిమాలు అఫీషియల్ గా ఈ రేంజ్ లోనే కలెక్షన్స్ ని సాదిస్తాయా లేక గ్రోత్ ని ఏమైనా సొంతం చేసుకుంటాయో చూడాలి ఇక.