నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాలయ్య కి రేర్ సెన్సేషనల్ మూవీ అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా అటు నటన పరంగా అద్బుతమైన పేరు తెచ్చి పెట్టిన ఈ సినిమా వరుస డిసాస్టర్ మూవీస్ లో ఉన్న బాలయ్య కి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ మాస్ కంబ్యాక్ దక్కేలా చేయడమే కాదు లాంగ్ రన్ లో బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం….
బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసి దుమ్ము లేపిన ఈ సినిమా డిజిటల్ లో రిలీజ్ అయినా కానీ అటు బాక్స్ ఆఫీస్ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. లేటెస్ట్ గా సినిమా అల్టిమేట్ రికార్డుల జాబితాలో మరో రికార్డ్ వచ్చి చేరగా బాలయ్య కెరీర్ లో…
ఆల్ మోస్ట్ 21 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ రికార్డ్ ను అందుకున్న సినిమా గా నిలిచింది అఖండ సినిమా. హైదరాబాదు లోని RTC X రోడ్స్ లో కోటి గ్రాస్ ను అందుకున్న రెండో సినిమా గా అఖండ సినిమా ఇప్పుడు సంచలన రికార్డ్ ను సాధించింది… ఇది వరకు బాలయ్య కెరీర్ లో….
21 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఇండస్ట్రీ హిట్ బొమ్మ నరసింహా నాయుడు సినిమా ఇక్కడ కోటి గ్రాస్ ను వసూల్ చేయగా తర్వాత బాలయ్య నటించిన సినిమాలు మిగిలిన ఏరియాల్లో అద్బుతాలు సృష్టించినా కానీ నైజాంలో అంచనాలను అందుకోలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ అఖండ సినిమా మాత్రమే నైజాంలో అంచనాలను మించే వసూళ్ళని సొంతం చేసుకోగా దాంతో పాటు…
ఇప్పుడు RTC X రోడ్స్ లో కోటి గ్రాస్ ను సొంతం చేసుకుని కెరీర్ లో 21 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ రేర్ ఫీట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇప్పటికీ RTC X రోడ్స్ లో డీసెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో మరింత కలెక్షన్స్ ని ఇక్కడ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా పరుగు కూడా మరికొంత టైం ఉండే అవకాశం ఉందని చెప్పాలి.