కొన్ని కొన్ని సార్లు సినిమా ఔట్ పుట్ బాగా రాక పొతే కొన్ని సీన్స్ రీ షూట్ చేయడానికి మేకర్స్ వెనకాడరు, కానీ బడ్జెట్ మళ్ళీ పెరిగిపోవడం మాత్రం కొందరు నిర్మాతలకు ఇబ్బంది పెట్టడం ఖాయం, అలాంటిది సినిమా మొత్తం పూర్తీ అయ్యి అది నచ్చక పొతే అప్పుడు ఏం చేయాలి, ఆ సినిమాను రిలీజ్ చేయాలా లేక అలా వదిలేయాలా అనేది ఆ యూనిట్ కి కూడా మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది…
కానీ బిలియన్ డాలర్ కంపెనీ అయిన నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కోసం ఏకంగా 150 కోట్లకు పైగా ఖర్చు చేసి ఔట్ పుట్ చూసిన తర్వాత ఏం బాలేదని ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ గా పక్కకు పెట్టేశారు…. అది ఏ హాలీవుడ్ ప్రాజెక్టో కాదు…. ఫస్ట్ టైం…
ఇండియాలో బిగ్గెస్ట్ బడ్జెట్ తో మొదలు పెట్టిన ఎపిక్ బాహుబలి కి ది బిగినింగ్ కన్నా ముందు స్టొరీ పాయింట్ తో తెరకెక్కిన బాహుబలి బిఫోర్ బిగినింగ్ సిరీస్…ఈ ప్రాజెక్టు మీద టాలీవుడ్ దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు సైతం పని చేశారు. కానీ ఔట్ పుట్ నచ్చక దాన్ని పక్కన పెట్టేశారు.
ఆ తర్వాత ఒక బాలీవుడ్ యంగ్ డైరెక్టర్, ఇంకో టీంను సెట్ చేసుకుని కొత్తగా మళ్లీ వర్క్ చేసి.. కొన్ని నెలల కిందటే ఈ సిరీస్‌ను పట్టాలెక్కిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇందులో భలే మంచి రోజు హీరోయిన్ వామికా గబ్బి.. శివగామి పాత్ర చేస్తోందని.. నయనతారను ఓ ముఖ్య పాత్రకు తీసుకున్నారని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం….
ఈ ప్రాజెక్ట్ నచ్చక కంప్లీట్ గా పక్కకు పెట్టేశారని వార్తలు ఇండియన్ మీడియా మొత్తం ఊపెస్తున్నాయి, ఒకటి రెండు కోట్లు అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఏకంగా 150 కోట్ల రేంజ్ బడ్జెట్ ని అలా పక్కకు పెట్టేయడం నిజంగానే మైండ్ బ్లాంక్ అని చెప్పాలి. మరి ఈ ప్రాజెక్ట్ ఏమైనా మార్పులు చేర్పులతో వస్తుందా లేక కంప్లీట్ గా ఆగిపోయినట్లేనే అనేది చూడాలి..