పుష్ప బాక్స్ ఆఫీస్ రాంపేజ్ ఆగడం లేదు, తెలుగు రాష్ట్రాలలో సినిమా కలెక్షన్స్ క్లోజ్ అయినా కానీ హిందీ లో మాత్రం ఎక్స్ లెంట్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న పుష్ప సినిమా అక్కడ లాంగ్ రన్ లో ప్రీవియస్ రికార్డులను అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలుస్తూ దూసుకు పోతూ ఉండగా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర 45 వ రోజు సినిమా జోరు చూపెట్టి బాగా హోల్డ్ చేసింది.
ఇక సినిమా ఇతర ఇండస్ట్రీలలో కూడా ఆల్ మోస్ట్ పరుగు క్లోజ్ అవ్వగా ఒక్క హిందీ లో మాత్రం 7 వ వారంలో కూడా కావలసినన్ని థియేటర్స్ ఈ సినిమాకి దొరకగా వేరే ఏ సినిమాలు పోటి లేక పోవడంతో థియేటర్స్ లో జనాలు చూడాలి అనుకుంటే ఉన్న…
ఒకే ఒక్క ఆప్షన్ గా మారిన పుష్ప డిజిటల్ రిలీజ్ అయినా కానీ కలెక్షన్స్ పరంగా జోరు చూపెడుతూ ఇప్పుడు 45 రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 180 కోట్ల షేర్ మార్క్ ని 348 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలన రికార్డు నమోదు చేసింది… ఏరియాల వారి కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 40.74Cr(Without GST 37.47Cr)
👉Ceeded: 15.17Cr
👉UA: 8.13Cr
👉East: 4.89Cr
👉West: 3.95Cr
👉Guntur: 5.13Cr
👉Krishna: 4.26Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 85.35CR(133.25CR~ Gross)
👉Karnataka: 11.76Cr
👉Tamilnadu: 13.58Cr
👉Kerala: 5.60Cr
👉Hindi: 47.00Cr
👉ROI: 2.24Cr
👉OS – 14.56Cr
Total WW: 180.09CR(348CR~ Gross)
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 45 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…
సినిమాను మొత్తం మీద 144.9 కోట్ల రేటు కి అమ్మగా 146 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ వసూళ్ళని సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 34.09 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. పరుగు ఆల్ మోస్ట్ కంప్లీట్ అనుకున్నా కానీ ఇప్పటికీ పబ్లిసిటీ జరుగుతూ ఉండటంతో కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి.